Ramgopalpet Police Issues Notice To Hero Allu Arjun :సినీనటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడిని పరామర్శించేందుకు హీరో అల్లు అర్జున్ వస్తారనే సమాచారంలో పోలీసులు ఈ నోటీసులను జారీ చేశారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
మరోవైపు చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్లారు. సంధ్య థియేటర్ కేసులో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం పీఎస్ ముందు హాజరుకావాలని ఆదేశాాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను జనవరి 3వ తేదీ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని నాంపల్లి కోర్టు ఆదేశాలలో పేర్కొంది. ఈ క్రమంలో చిక్కడపల్లి పీఎస్‌లో హజరై సంతకం చేసి అల్లు అర్జన వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
'అల్లు ఆర్మీ, అభిమానుల పేరుతో వందల కాల్స్ - చంపేస్తామని బెదిరింపులు'
ఇదీ జరిగింది:'పుష్ప 2’ మూవీ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అనే విధంగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.