Rains Decrease in AP :శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన వాయుగుండం ప్రస్తుతం దక్షిణ ఒడిశా - ఛత్తీస్‌గఢ్ భూభూగాలపై కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (India Meteorological Department) (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు 60 కిలోమీటర్లు, మల్కాన్ గిరికి 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ (AP Weather Report Today) ప్రకటించింది. గడచిన 6 గంటలుగా ఇది వాయువ్య దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదిలినట్టు తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఏపీలో భారీ వర్షాలు - సహాయక చర్యలపై చంద్రబాబు సమీక్ష - CM Chandrababu Review On Rains
తగ్గుతున్న వర్షాల ఉధృతి : మరోవైపు వాయువ్య భారత్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర పై పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఉన్న రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నట్టు ఐఎండీ తెలిపింది. వీటన్నిటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు వాయుగుండం ప్రభావం ఏపీపై క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. దీంతో క్రమంగా వర్షాల ఉధృతి కూడా తగ్గుతుందని స్పష్టం చేసింది.