Rains in Andhra Pradesh 2024 : రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు విస్తారంగా కురిశాయి. కోనసీమ ప్రాంతాల్లో తెల్లవారుజామున నుంచి కుండపోత వర్షం కురసింది. అమలాపురంతో సహా పలు మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. గుంతల రహదారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన రహదారులు గంతలమయంగా మారాయని స్థానికులు ఆరోపించారు. ప్రధాన రహదారి కావడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లే రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
భారీ వాహనాలు ప్రయాణించడంతో రహదారులు మరింత అద్వానంగా తయారవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నూతన రహదారిని నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నూతన రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సం- విరిగిన కొండచరియలు, స్తంభించిన జన జీవనం - rain updates
NTR District :ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి కురిసిన వర్షానికి విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్, ఆటోనగర్ ప్రాంతాల్లో రహదార్లపైకి నీరు చేరింది. వాహనదారులు, ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. జిల్లా అంతటా దాదాపు వర్షాలు కురుస్తున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెవిటికల్లు బీసీ కాలనీలోకి వరద నీరు చేరింది.