Rain Effect to General Election 2024 : రాష్ట్రంలో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపు(సోమవారం) పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. మొన్నటివరకు భానుడు భగభగా మండిపోతు నిప్పులు కురిపించగా మధ్యలో వరుణుడి ఎంట్రీతో వాతావరణం కొంత చల్లబడింది. కాగా మళ్లీ నిన్న, ఈరోజు మళ్లీ మెల్లగా ఎండలు దంచికొట్టటం ప్రారంభించాయి. కాగా ప్రస్తుతం అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ వేళ మరోసారి వరుణుడు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలింగ్ రోజున భారీ వర్ష సూచన - అభ్యర్థుల్లో టెన్షన్! - Telangana Rain Alert to Polling Day
అకాల వర్షలతో పోలింగ్ సిబ్బంది అవస్థలు :ఎన్నికల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో అకాల వర్షం కారణంగా పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్‌లో ఈవీఎం, ఇతర పరికరాలను అధికారులు అందజేశారు. అయితే ఈదురు గాలులతో భారీ వర్షం రావడంతో అక్కడ వేసిన టెంట్లు కూలిపోయాయి. ఈవీఎంలు, తదితర సామాగ్రిని వేరే ప్రాంతానికి తరలించేందుకు పోలింగ్ సిబ్బంది అవస్థలు పడ్డారు. హైస్కూల్ గ్రౌండ్‌లో వర్షపు నీరు నిలవడంతో బస్సులు ముందుకు కదలక మెురాయించాయి. జేసీబీ సహాయంతో వాటిని ముందుకు కదిలించారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించినా అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈదురు గాలులతో కూడిన వర్షం - కుప్పకూలిన టెంట్లు :కడప జిల్లా పులివెందుల లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో ఎన్నికల కోసం జేఎన్టీయూ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు కుప్పకూలిపోయాయి. కుర్చీలు కింద పడ్డాయి, చిరుజల్లులతో కూడిన వర్షం పడడంతో ఎన్నికల సిబ్బందిం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి తీసుకొని సిబ్బంది బస్సులు ఎక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు.
భానుడు వస్తాడో, వరుణుడు వస్తాడో? : దేశంలోని పలు రాష్ట్రాల్లో మే 11 నుంచి 15 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఆ పలు రాష్ట్రాల్లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉండడం గమనార్హం. అంటే మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ రోజు వరుణుడు కూడా ఓటేసేందుకు విచ్చేయనున్నాడన్న మాట. తీవ్రమైన ఎండలుంటే పోలింగ్ ప్రక్రియపై ప్రభావం పడనుంది. మండుటెండలో ఓటేసేందుకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపరని అందరూ భావిస్తుంటే ఇప్పుడు వర్షం పడనుందని చెప్తున్నారు. ఒకవేళ వర్షం కురిసినా వానల్లో తడుస్తూ ఓటేసేందుకు అంతగా ఆసక్తిచూపించరని వర్షం కూడా ఓటింగ్ మీద ప్రభావం చూపించనుందని అభిప్రాయపడుతున్నారు. మరి మే 13న ఓటు హక్కు వినియోగించుకునేందుకు భానుడు వస్తాడో, వరుణుడు వస్తాడో చూడాలి మరి.
రాష్ట్రంలో తారాస్థాయికి చేరుకున్న ఉష్ణోగ్రతలు - రాబోయే 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
అకాల వర్షంతో రాష్ట్రంలో అల్లకల్లోలం - వందల ఎకరాల్లో దెబ్బతిన్న పసుపు, మొక్కజొన్న పంటలు