Raft Competitions in Nellore: సంక్రాంతి అంటేనే సంబురం. ఈ పండగ మూడు రోజులు చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఈ పండగకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రజలు స్వగ్రామాలకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుంటారు.
ఈ పండగ కోసం రకరకాల పోటీలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానమైనవి కోడిపందేలు. ఈ పందేల్లో ఇప్పటివరకు కోట్ల రూపాయలు చేతులు మారాయి. అయితే కోడిపందేలు కాకుండా ఇతర పందేలు కూడా నిర్వహించారు. కొన్నిచోట్ల పందుల పందేలు, పొట్టేలు పందేలు చేపట్టారు. ఇక రాయలసీమ జిల్లాల్లో ఎద్దుల పందేలు లాంటివి నిర్వహించారు.
ఈసారి ప్రభుత్వం టూరిజం అభివృద్ధిలో భాగంగా ఆత్రేయపురంలో పడప పోటీలు నిర్వహించాయి. కేరళకు మాత్రమే పరిమితమైన ఈ పోటీలు చేపట్టగా ఎంతోమంది ఆసక్తి కనబరిచారు. ఇకపై కూడా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే తరహాలో నెల్లూరు నగరంలో తెప్పల పోటీలు నిర్వహించారు.