Ground Breaking ceremony By PV Sindhu: ప్రముఖ షట్లర్ పీవీ సింధు అకాడమీ కోసం విశాఖ నగర పరిధిలోని హరిత ప్రాంతంలో కేటాయించిన భూమిలో నిర్మాణ పనులకు భూమి పూజ ఈ ఉదయం జరిగింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి ఈ భూమి పూజ ను నిర్వహించారు. ఉదయం సూర్యోదయం ముహూర్తం లోనే ఈ పూజా కార్యక్రమం ప్రారంభమైంది.ఇక్కడ అకాడమీ నిర్మాణం కోసం దాదాపు మూడు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కేటాయించింది. దీనిలో ప్రస్తుతం పనులను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు.
అంతేగాక పీవీ సింధు ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నారు. వీటితో పాటు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న లేక్‌వ్యూ అతిథి గృహం ఓఎస్డీగా సైతం ఉన్నారు. సింధు ఆన్‌డ్యూటీ సౌకర్యం 2025 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2022 వ సంవత్సరంలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో సింధు గోల్డ్ మెడల్ ను సాధించి దేశానికి వన్నె తెచ్చింది. 2018 లో జరిగిన గేమ్స్ లో సైతం కాంస్య పతకాన్ని సాధించింది.