PM Modi Public Meeting In Visakhapatnam :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి బుధవారం సమాచారం అందింది. ప్రధాని 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్‌కళాశాల మైదానానికి చేరుకుంటారు.
ఎన్టీపీసీ (NTPC) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వేజోన్ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ఇప్పటికే సభాస్థలంలో పనులు ప్రారంభించారు.