ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు మంగళగిరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం - PRESIDENT TOUR IN VIJAYAWADA

మంగళగిరిలోని ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

PRESIDENT DROUPADI MURMU TOUR IN MANGALAGIRI AIIMS
PRESIDENT DROUPADI MURMU TOUR IN VIJAYAWADA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2024, 7:03 PM IST

President Droupadi Murmu Tour In Vijayawada :భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 17న మంగళగిరిలో జరగనున్న ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ముందుగా ఉదయం 11.30 గంటలకు విజయవాడ చేరుకుని 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ స్నాతకోత్సవంలో 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేయనున్నారు. ప్రత్యేకంగా నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలను అందించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళగిరి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశఆరు. కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి సాయంత్రం 4.15కు విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయల్దేరుతారని అధికార వర్గాలు ప్రకటించాయి.

ఉత్తరాఖండ్ నుంచి నడ్డా దేశవ్యాప్త పర్యటన షురూ..

ABOUT THE AUTHOR

...view details