ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చట్టం తన పని తాను చేస్తుంది - బహిరంగంగా ఎవ్వరూ స్పందించొద్దు : మంచు విష్ణు - MAA ASSOCIATION PRESIDENT VISHNU

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA) అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.

MAA ASSOCIATION PRESIDENT MANCHU VISHNU
MAA ASSOCIATION PRESIDENT MANCHU VISHNU (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2024, 3:39 PM IST

Manchu Vishnu About MAA Artist Association Members:మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA) అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మా ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు విష్ణు కీలక సూచనలు చేశారు. సున్నితమైన విషయాల పట్ల ఎవరూ స్పందించకపోవడం మంచిదని తెలిపారు. మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, మంచి సత్సంబంధాలను కలిగి ఉంటారని ఈ సందర్భంగా విష్ణు పేర్కొన్నారు.

సృజనాత్మకతపై ఆధారపడి నడిచేది మన చిత్ర పరిశ్రమ అని వెల్లడించారు. అంతేగాక ప్రత్యేకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడటానికి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సభ్యులంతా సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవైతే, మరికొన్ని విషాదకరమైనవి. వాటిపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులు సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేకూర్చే ప్రమాదముందని విష్ణు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో మనకి సహనం, సానుభూతి, ఐక్యత అవసరమని ఉద్ఘాటించారు.

మా కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మా ఆధ్యక్షుడు విష్ణు అన్నారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఏ సమస్య వచ్చినా మనమంతా కలిసికట్టుగా ఎదుర్కొందామని మంచు విష్ణు తెలియజేశారు.

'ప్రభాస్ మేం చెప్పిన రోల్ చేయట్లేదు- తనకి నచ్చింది చేస్తున్నాడు' - Kannappa Prabhas

"నేను ఇంటికి వెళ్లడానికి అదొక్కటే కారణం - నా భార్య తల్లిదండ్రులు ఉండుంటే ఊరుకునేవారా?"

మీడియా ప్రతినిధులపై దాడి - మోహన్‌బాబుపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details