Postal GDS Results Released 2024:Postal GDS Results Released 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోస్టల్ శాఖలోని జీడీఎస్ పోస్టుల ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులను భర్తీ చేస్తూ జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. దీంతో దరఖాస్తు చేసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించినట్లైంది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టుల చొప్పున భర్తీ చేస్తున్నారు.
జీడీఎస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో మన రాష్ట్రం నుంచి 1,355 మందిని, తెలంగాణ రాష్ట్రం నుంచి 981 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.
తొలి సెలక్షన్ లిస్టును కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా పంపించారు. ఈ ప్రక్రియలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీలోగా సంబంధిత కార్యాలయాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ జీడీఎస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందిస్తారు.
ఎంపిక విధానం:
పోస్టల్ జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.