అర్ధరాత్రి పోలీసులపై తిరగబడ్డ గ్రామస్థులు - చర్యలు తప్పవన్న ఉన్నతాధికారులు (ETV Bharat) Police Officers Respond on Group Dance Program Incident : నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రూప్ డాన్స్ కార్యక్రమాన్ని అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై కార్యక్రమ నిర్వాహకులు వెంకటేశ్వర్లు మరికొంతమంది దౌర్జన్యానికి పాల్పడ్డారని డీఎస్పీ కోటారెడ్డి తెలిపారు. దీంతో కార్యక్రమం నిర్వాహకులు, ఈవెంట్ యాజమాన్యం పైన కేసులు నమోదు చేశామని డీఎస్పీ కోటారెడ్డి వెల్లడించారు.
వాలంటీర్ ఘరానా మోసం- అప్పు చేసి రూ.60 లక్షలతో పరారు - Volunteer Cheating
బసవరాజుపాలెంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రూప్ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రూప్ డాన్స్‌లకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు సీఐ వేణు, ఎస్సై ముత్యాలరావు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీనికి గ్రామస్థులు అంగీకరించకుండా స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు వెళ్లారు. దీంతో పోలీసులకు గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికిగ్రామం మొత్తం ఒకటై పోలీసులపై తిరగబడ్డారు. ఎంత చెప్పినా వినకుండా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ రవాణ - అడ్డుకున్న గ్రామస్థులు
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు, డాన్సులకు, పలు పబ్లిక్ కార్యక్రమాలకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు డీఎస్పీ (DSP) కోటారెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి మరీ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా కొన్ని కార్యక్రమాల పై ఆంక్షలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే నిర్వాహకుల పైన, ఈవెంట్ యాజమాన్యం పైన కేసులు నమోదు చేశామని తెలిపారు. వీడియోలు పరిశీలించి మరికొందరి పైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కోటారెడ్డి స్పష్టం చేశారు.
అయితే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు నగర, గ్రామీణ డీఎస్పీలు శ్రీనివాస రెడ్డి, వీరాం జనేయరెడ్డి హెచ్చరించారు. నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను నగర డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం వెల్లడించారు. ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపై ఉండరాదన్నారు. కౌంటింగ్ రోజున అనవసరంగా రోడ్లపైకి వచ్చి అల్లర్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ ఏజెంట్లు, ఇతరులు ఈసీ నిబంధనలు పాటించాలన్నారు. పోలీసు హెచ్చరికలను అతిక్రమించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు.
గ్రూప్ డాన్స్ అడ్డుకున్న పోలీసులు- సీఐ, ఎస్ఐపై తిరగబడ్డ గ్రామస్థులు - Villagers Attacked on Police