ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో పోలీసుల మాక్​ డ్రిల్​ - ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయిన ప్రజలు - Additional SP Conduct Mock Drill

Police Mock Drill in Piduguralla: పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్లో పోలీస్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు, ఆ తరువాత రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకోబోయే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Police Mock Drill in Piduguralla
Police Mock Drill in Piduguralla (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 9:50 AM IST

Updated : May 30, 2024, 10:18 AM IST

పిడుగురాళ్లలో పోలీసుల మాక్​ డ్రిల్​ - ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయిన ప్రజలు (ETV Bharat)

Police Mock Drill in Piduguralla: ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు, ఆ తరువాత రోజు అల్లర్లకు పాల్పడినా, ప్రోత్సాహించినా కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రామచంద్రరాజు హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా ప్రజలు సహకరించాలని కోరారు. పిడుగురాళ్లలో ఐలాండ్ సెంటర్లో పోలీస్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకోబోయే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ విధంగా మాక్​ డ్రిల్​పై వివరణ: పల్నాడులో ఒక్కసారిగా జరిగిన అలజడికి పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు సరికదా ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. చేతికి అందినవి పోలీసులపై విసరడం మొదలు పెట్టారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో అదనపు ఎస్పీ రామచంద్రరాజు ఆధ్వర్యంలో ఆర్డ్మ్​ రిజర్వ్ దళాలు, ప్రత్యేక సాయుధ దళాలు అక్కడికి చేరుకున్నాయి.

ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు- అక్కడ 144 సెక్షన్​ అమలు - POLICE MOCK DRILL

ముందుగా ఆందోళనకారులకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి బాష్ప వాయువును ప్రయోగించారు. పరిస్థితులు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరోవైపు ప్లాస్టిక్ బుల్లెట్స్ ఫైర్ చేసి హెచ్చరించారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ నిరసనకారుడికి బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలగా మరొకరు తలకు గాయాలై తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్సుల హడావుడి పోలీసు వాహనాల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు.

'కనిగిరిలో అల్లర్లు, పెట్రోల్​ బాంబు దాడులు- పోలీసుల​ లాఠీచార్జి, ఫైరింగ్' - police Mock Drill in kanigiri

ఈ దృశ్యాలను చూస్తూ భీతావహులైన ప్రజలకు ఒక ప్రకటన వినిపించింది. 'ఇది మాక్ డ్రిల్' కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించడంలో భాగంగా పోలీసులు చేసిన సన్నాహక కార్యక్రమం అని పోలీసులు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలో పోలీసులు చేపట్టిన నమూనా ప్రదర్శన ఇది. పేరుకే మాక్ డ్రిల్ అయినప్పటికీ వాస్తవాలను కళ్లకు కట్టింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మరో మూడు రోజులు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

పోలీసుల మాక్ డ్రిల్‌ - ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా వీక్షించిన ప్రజలు - Police Mock Drill in Dharmavaram

Last Updated : May 30, 2024, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details