Police Notice to YSRCP Central Office in Attack on TDP Office Case:గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కుట్ర వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిందని టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచే వాహనాల్లో వచ్చారని కూడా అందులో పేర్కొన్నారు.
స్పందించని వైఎస్సార్సీపీ కార్యాలయం : అందుకే ఘటన జరిగిన రోజు వైఎస్సార్సీపీ కార్యాలయం సీసీ ఫుటేజ్ సమర్పించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ దృశ్యాల ఆధారంగా ఆ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన వారు, టీడీపీ కార్యాలయం పై దాడి చేసిన వారు ఎవరెవరనేది తేల్చనున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు కావాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించారు. కానీ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి దీనిపై ఎటువంటి స్పందన లేదు.