PM Narendra Modi Wishes Telugu Language Day in Mann Ki Baat Program : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ 113వ మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ఈ నెల 29న (ఆగస్టు 29న) తెలుగుభాష దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వారందరికీ తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష అని కొనియాడారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆ భాగంగా ప్రధాని తెలుగు భాషా దినోత్సవం గురించి ప్రస్తావించారు.
Telugu Language Day Sand Sculpture : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా.. సందేశాత్మకంగా సైకత శిల్పం..
యువత రాజకీయాల్లోకి వస్తేనే ప్రజాస్వామ్యానికి బలం: వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశ పునాదులను పటిష్ఠం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎలాంటి నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట వేదికగా ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశం, బలమైన ప్రజాస్వామ్యం కోసం నేటి యువత ప్రజా జీవితంలోకి రావాలని పునరుద్ఘాటించారు.
స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. దేశం కోసం వారు తమని తాము పూర్తిగా అంకితం చేసుకున్నారని తెలియజేశారు. నేడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మనం మరోసారి అదే స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం కావాలని తెలియజేశారు. కుటుంబ రాజకీయాలు నూతన ప్రతిభను అణచివేస్తాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.