Pension Distribution Issue in AP :సీఎం జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలకు పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే విధంగా సర్వాధికారులు ఉన్నా వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. పండుటాకులను మండుటెండల్లో మలమలమాడిపోయేలా వ్యూహం పన్నారు. ఈ పాపమంతా ఎవరిది జగన్‌ది కాదా. 46 డిగ్రీలను మండుటెండల్లో వృద్ధులు, వితంతువులను ఒంటరి మహిళలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేకుండా వారిపై కక్ష సాధిస్తున్నారు.
ఈ పాపం జగన్‌దే - అవ్వాతాతల ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయాలు? - Pensioners FACING PROBLEMS
Pensioners Problem :గత నెల సచివాలయ కార్యాలయంలో పింఛన్ పంపిణీలో జరిగిన లోటుపాటులను సరిచేయలసిన అధికారులు వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేశాము అంటూ వారిని నానా అవస్థలు పడేలా చేశారు. బ్యాంకుల్లో వృద్ధులు కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక, గంటల తరబడి నిల్చోలేక నరకయాతన అనుభవించారు. కొన్ని చోట్ల బ్యాంకులు నిండిపోవడంతో తలుపులు మూసి వృద్ధుల్ని బయటే ఎండలో నిలబడేలా చేశారు. ఇలా ఒకటి, రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారుల్ని నానా కష్టాలు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు.