Boy kidnapped in Ganja business :అరకులోయలో మొదలైన గంజాయి కథ ఊహించని మలుపులు తిరిగింది. ఓ యువకుడి ఆశ మొత్తం ఐదుగురు యువకులను కటకటాల పాల్జేసింది. 'సస్పెన్స్ థ్రిల్లర్' సినిమాను తలపించే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ పాడేరు డీఎస్పీ ప్రమోద్ కథనం మేరకు వివరాలివి.. పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన షేక్ యాసిన్ అనే కారు డ్రైవర్ మూడు నెలల కిందట అరకులోయ వెళ్లాడు. అరకులోయ మండలం మాడగడ గ్రామానికి చెందిన ప్రకాష్, సుశీల్ కుమార్తో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పది రోజుల కిందట తనకు గంజాయి కావాలని యాసిన్ కోరడంతో స్నేహితులు ఒప్పుకున్నారు. దీంతో యాసిన్ తన స్నేహితుడు సంతోష్, మరో వ్యక్తిని అరకులోయకు పంపించి 20వేల రూపాయలు ప్రకాష్, సుశీల్ కుమార్కు అందజేశాడు. కానీ, డబ్బులు తీసుకున్న ఆ ఇద్దరూ గంజాయి ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమయ్యారు.
బడ్డీ కొట్టులో గంజాయి చాక్లెట్లు - వ్యక్తి అరెస్ట్
ఎంత వెదికినా ఇద్దరూ కనిపించకపోవడం, వారిని కలిసే అవకాశం లేకపోవడంతో యాసిన్ స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్లు కూడా స్విచాఫ్ వస్తుండడంతో చివరకు యాసిన్ కు చెప్పారు. దీంతో 'మీరు వచ్చేయండి.. వాళ్ల సంగతి నేను చూసుకుంటా' అని చెప్పడంతో సంతోష్, మరో వ్యక్తి తిరిగి వినుకొండకు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా గత నెల 27న సంతోష్, మరో వ్యక్తితో కలిసి అరకు వచ్చిన యాసిన్.. ప్రకాష్ సుశీల్ కోసం వెదికాడు. వారు కనిపించకపోవడంతో మరో పథకం వేశాడు. అందులో భాగంగా ఆ ఇద్దరి స్నేహితుడైన పదహారేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి వినుకొండకు తీసుకెళ్లారు.