ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్​సీపీ నేతలు రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై విచారణకు ఆదేశం - Inquiry on Roja and Dharmana - INQUIRY ON ROJA AND DHARMANA

Order for Inquiry on YSRCP Leaders Roja and Dharmana Krishnadas: మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై విచారణ జరపాలని సీఐడీ ఏడీజీ ఎన్టీఆర్‌ జిల్లా సీపీని ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆ ఇద్దరు వైఎస్సార్​సీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆట్యపాట్య సంస్థ సీఈవో ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

inquiry_on_roja_and_dharmana
inquiry_on_roja_and_dharmana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 10:41 PM IST

Updated : Aug 16, 2024, 6:42 AM IST

Order for Inquiry on YSRCP Leaders Roja and Dharmana Krishnadas:ఆడుదాం ఆంధ్ర పేరుతో వైఎస్సార్​సీపీ మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్‌ చేసిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా అవినీతికి పాల్పడ్డారని ఆటపాట్య సంస్థ సీఈఓ ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరపాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Irregularities in Aadudam Andhra :ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అధికార వైఎస్సార్సీపీ నేతలు అరాచకంగా వ్యవహరించారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకంటూ ప్రగల్బాలు పలికారు. కానీ ప్రతిభావంతులను పక్కన పెట్టి ఎవరు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎవరిని విజేతలుగా ప్రకటించాలనే విషయాలను ఆ పార్టీ నేతలే నిర్ణయించారు. క్రీడా స్ఫూర్తి, క్రీడా నిబంధనలు లేవు. శాప్, ఇతర అధికార యంత్రాంగమంతా ప్రేక్షక పాత్ర వహించగా అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా ఆడుదాం ఆంధ్రాను రాజకీయ ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకున్నారు. దాదాపు 150 కోట్ల ప్రజాధనంతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

Last Updated : Aug 16, 2024, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details