ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

69 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా - ఎంఏ అడ్మిషన్​కు సిద్ధం - ANDHRA UNIVERSITY

69 సంవత్సరాల వృద్ధాప్యంలో బీఏ డిగ్రీ పట్టా అందుకున్న బామ్మ

69 Years Old Woman Got Degree at Andhra University
69 Years Old Woman Got Degree at Andhra University (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 12:15 PM IST

69 Years Old Woman Got Degree at Andhra University :చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు 69 ఏళ్ల బామ్మ. చిన్న పిల్లలు సైతం కళ్లజోడు పెట్టుకుని పరీక్ష రాస్తున్న నేటి చదువుల ప్రపంచంలో 69 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా ఎటువంటి అద్దాలు పెట్టుకోకుండా పరీక్ష రాసి బీవీకే కళాశాలలోని ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం (Andhra University Distance Education Center) నుంచి బీఏ పట్టా ( BA Degree) అందుకున్నారు అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో నివాసముంటున్న యడవిల్లి ఇందిర. ఈమె తల్లిదండ్రులకు 11 మంది సంతానం. ఆ రోజుల్లో అంతమందిని వాళ్ల నాన్న చదివించలేకపోవడంతో గోపాలపట్నంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 1970లో పదో తరగతి వరకు చదివారు.

యడవిల్లి ఇందిరకు 1978లో వైవీ హనుమంతురావుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు మగ పిల్లలు. వారికి విద్యాబుద్ధులు నేర్పించి వివాహాలు జరిపించారు. అనంతరం వారంతా జీవితంలో స్థిరపడ్డారు. 2017లో ఆఖరి కుమారుడి వివాహం జరిగింది. అంతటితో వారి బరువు బాధ్యతలు పూర్తయ్యాయి ఆ దంపతులకీ. ఆ తర్వాత చిన్నతనంలో వదిలేసిన చదువును ఎలాగైనా పూర్తి చేయాలని ఇందిర నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆ మాటను భర్తతో చెప్పడంతో ఆయన ఒప్పుకొని ప్రోత్సహించారు. నెలలో రెండో శనివారం, ఆదివారాల్లో తరగతులకు హాజరయ్యేవారు ఇందిరా. పరీక్షలు నెల రోజుల ముందు నుంచి ప్రతిరోజూ రాత్రి 12 గంటల వరకు తిరిగి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు చదువుకునేవారు. తన భర్త తనను తరగతులకు తీసుకెళ్లడంలో ఎక్కువ సహకారం అందించారని ఇందిర తెలిపారు. ఇప్పుడు ఎంఏలో చేరాలని ఉందని ఆమె అన్నారు.

ABOUT THE AUTHOR

...view details