ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ కార్పొరేషన్​లకు డిప్యూటీ మేయర్ల ఎన్నిక - తేదీ ప్రకటించిన ఎన్నికల సంఘం - NOTIFICATION FOR ELECTION

మున్సిపాలిటీలు, కార్పొరేషన్​లలో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్​ పర్సన్, డిప్యూటీ మేయర్​ల ఎంపిక - నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

Notification_for_Elections
Notification for Elections in Municipalities (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2025, 5:29 PM IST

Notification for Elections in Municipalities: ఆంధ్రప్రదేశ్​లోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్​లలో ఖాళీగా ఉన్న ఛైర్ పర్సన్, వైస్ ఛైర్​ పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30లోగా ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే నెల మూడో తేదీన పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్​లకు డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించనున్నారు. నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో ఛైర్​పర్సన్​ల కోసం ఎన్నిక చేపట్టనున్నారు. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ ఛైర్ పర్సన్​ల కోసం ఎన్నిక జరగనుంది. ఆయా మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు.

Notification for Elections in Municipalities (ETV Bharat)

జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు - గుర్తుగా గాజు గ్లాసు

ABOUT THE AUTHOR

...view details