ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో సిటీ బస్సులకు ప్రజల డిమాండ్‌- సొంత జిల్లా నేతలు చేసిందేమీ లేదని విసుర్లు - No City buses in Kadapa

No City buses in Kadapa: పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కడప నగరంలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. మాజీ సీఎం జగన్‌, అప్పటి ఆర్టీసీ ఛైర్మన్‌ సొంత జిల్లా వాసులైనప్పటికీ ప్రజలకు సిటీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకురాలేకపోవటం దారుణమన్నారు.

No City buses in Kadapa
No City buses in Kadapa (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 1:39 PM IST

No City buses in Kadapa: కడప నగర జనాభా పెరుగుతోంది. జనాభాకు తగినట్లు రవాణా సౌకర్యాలు మాత్రం లేవు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ కడపలో సిటీ బస్సులు లేకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రతి పనికీ ఆటోను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆటో వాలాలు దొరికినంత దోచేసుకుంటున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో మాజీ సీఎం జగన్‌, ఆర్టీసీ ఛైర్మన్ జిల్లా వాసులైనప్పటికీ స్పందించలేదు. ఆటో ఎక్కి దిగితే చాలు 20 నుంచి 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు 200 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కడపలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కడప నగరంలో సుమారు నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారు. సొంత వాహనాలు సొంత ద్విచక్ర వాహనాలు వారు ఉన్నప్పటికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆటోలను ఆశ్రయిస్తుంటారు. కానీ కడప నగరంలో ఇప్పటివరకు సిటీ బస్సులు లేకపోవడం హాస్యాస్పదంగా ఉంది. పక్క జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలలో సైతం సిటీ బస్సులు ఉన్నాయి. అలాంటిది కడప నగరంలో మాత్రం సిటీ బస్సులు లేకపోవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అవును అవి ఆర్టీసీ బస్సులే!- ప్రయాణమంటేనే భయపడుతున్న ప్రజలు - YSRCP Govt Neglect APSRTC

కడప నగరం ఒకప్పుడు ఐదు కిలోమీటర్ల పరిధి ఉండేది. ఇప్పుడు 20 కిలోమీటర్లకు చేరుకుంది. కడప శివారు ప్రాంతాలలో విమానాశ్రయం, ఎన్టీపీసీ, రిమ్స్ ఆసుపత్రి, కొప్పత్తి పరిశ్రమల వాడ, యోగి వేమన విశ్వవిద్యాలయం తదితర ప్రాంతాలు విస్తరించాయి. ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే కనీసం 150 నుంచి 200 రూపాయలు ఆటోకు వెచ్చించాల్సి వస్తోంది. అదే సిటీ బస్సులు ఉంటే అతి తక్కువ ధరకు వెళ్లొచ్చు. అధికారులు, పాలకులు మాత్రం సిటీ బస్సులపై దృష్టి సాధించకపోవడం ప్రజలకు శాపంగా మారింది. పైగా రాత్రి వేళల్లో ఆటోవాలాలు అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నారు. ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి సిటీ బస్సుల ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రస్తుత జనాభాకు అనుగుణంగా సిటీ బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆటోలలో అధిక సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి జిల్లా వాసి కావడంతో సిటీ బస్సులు ఏర్పాటుపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. సిటీ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులతో పాటు కడప శివారులో ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ ధరకు కావలసిన చోటికి ప్రయాణం చేయవచ్చునని నగరవాసులు అంటున్నారు.

జగన్​ హయాంలో కష్టాల ఊబిలో ఆర్టీసీ - కొత్త ప్రభుత్వం ఏం చేయనుంది! - YSRCP Govt Neglect RTC Buses

ABOUT THE AUTHOR

...view details