New Year Special Decoration in kadiyam Nursery :నూతన సంవత్సర వేళ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలు సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. దేశ విదేశాలకు చెందిన మొక్కలు, పూలతో నర్సరీకే కొత్త కళ వచ్చింది. దేశవాళీ పూలైన బంతి, చామంతి మొదలుకొని విదేశాలకు చెందిన థాయ్ బొన్సాయ్‌లకు పూసిన రంగురంగుల పూలు ఉద్యానవనానికే ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి.
కడియం నర్సరీలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన విరుల వనాలు. వేలాది రకాల మొక్కలు, వృక్ష జాతులతో అలరారుతున్నాయి. దశాబ్దాలుగా సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అలాంటి ఇక్కడ విదేశీ మొక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎక్కడో సప్త సముద్రాల అవతల పుట్టి, పెరిగిన విదేశీ మొక్కలు, వృక్షాలు కూడా ఈ కడియం నర్సరీలకు వచ్చి ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా కొనుగోలుదారుల ఇళ్లు, కార్యాలయాలు, ఉద్యానాల్లోకి చేరి సందడి చేస్తున్నాయి. అలాంటి కొన్ని విదేశీ మొక్కలు, ఇక్కడ ప్రత్యేకం.