రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించింది. అందుకోసం ఈ నెల 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. అర్హత ఉన్న వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత అర్హత ఉన్న వారికి సంక్రాంతికి నూతన కార్డులు మంజూరు చేస్తారని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డులపై వైఎస్సార్సీపీ రంగులతోపాటు జగన్ బొమ్మను ముద్రించారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైంది.
కొత్త జంటలకూ రేషన్ కార్డు - కుటుంబ సభ్యుల చిత్రాలతో సరికొత్తగా!
అన్నింటికీ రేషన్ కార్డులే : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుతో పాటు, ఉన్న వాటి సవరణకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు పింఛను మంజూరు చేయాలన్నా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలన్నా, దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా ప్రాథమికంగా బియ్యం కార్డు కలిగి ఉండాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇవి తప్పకుండా ఉండాలి.
ఏపీలో ట్రాన్స్‌జెండర్లకు స్వయం సహాయక బృందాలు- ప్రత్యేకంగా రేషన్ కార్డులు