ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడ్​న్యూస్​ - రాష్ట్రంలో జనవరి నుంచి కొత్త పింఛన్లు - NEW PENSIONS RELEASED FROM JANUARY

జనవరిలోపే అనర్హుల ఏరివేత- విధివిధానాల రూపకల్పనకు 8 మంది మంత్రులతో ఉపసంఘం

new_pensions_released_from_january_in_ap
new_pensions_released_from_january_in_ap (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2024, 8:58 AM IST

New Pensions Released From January in AP :రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. జన్మభూమి-2 కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించే అవకాశాలున్న నేపథ్యంలో ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు మార్గసూచి సిద్ధం చేసినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో అనర్హులకు ఇబ్బడిముబ్బడిగా పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ప్రధానంగా కొన్ని వేల మంది అనర్హులు దివ్యాంగుల కేటగిరీలో తప్పుడు సదరం ధ్రువీకరణపత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్‌, అనంతపురం జిల్లాలతోపాటు మరికొన్నిచోట్ల ఇది బట్టబయలైంది.

చేనేత పింఛన్లలోనూ అనర్హులు ఉన్నట్లు తేలింది. దీంతో అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. పింఛన్ల తనిఖీ, కొత్త పింఛన్ల మంజూరుకు విధివిధానాల రూపకల్పన కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్, డోలా బాల వీరాంజనేయస్వామి, గుమ్మిడి సంధ్యారాణి, సవితలతో ఉపసంఘం ఏర్పాటుకు రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కమిటీ ఏర్పాటైన 10-15 రోజుల్లోగా ప్రభుత్వానికి అందించనున్నట్టు సమాచారం.

జన్మభూమి-2 కు ముహూర్తం ఖరారు- వచ్చే ఐదేళ్లలో 17,500 కి.మీ సీసీ రోడ్లు - CM Chandrababu Review Meeting

50 రోజుల ప్రణాళిక :కొత్త పింఛన్ల ఎంపికకు నవంబర్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదే నెలలో పింఛన్ల తనిఖీ చేపడతారు. 45 రోజుల్లో అనర్హులకు నోటీసులిచ్చి, పింఛన్లు తొలగిస్తామని అధికారులు తెలిపారు. అర్హులెవరికీ అన్యాయం జరగకుండా అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామసభల్లో ప్రజల ముందు పెడతారు. అక్కడ ఏవైనా ఫిర్యాదులు వస్తే సరిచేస్తారు. మొత్తంగా డిసెంబర్‌ నెలాఖరు నాటికి కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రస్తుత పింఛన్లలో అనర్హుల ఏరివేత పూర్తి చేయనున్నట్టు తెలిసింది.

2.32 లక్షల మందికి పింఛను ఇవ్వకుండా జగన్‌ మోసం :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ పింఛను అందిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్‌ ఎన్నికల నాటికి 2.32 లక్షల మందికి పింఛను ఇవ్వకుండా నిలిపేశారు. 2023 సెప్టెంబర్‌ నాటికే వీరందరూ పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమందికి మాత్రమే మంజూరు చేసి మిగతా వారికి ఇవ్వలేదు గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలిస్తుందా లేదా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారా అనేది మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించనుంది.

గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం - ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ - Pension Distribution in AP

ABOUT THE AUTHOR

...view details