NDA Leaders Celebrations :లక్ష్యాలకు తగ్గట్లు మంత్రులకు శాఖలు కేటాయిస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రధర్మం పాటించారు. జనసేన, బీజేపీలకు కీలక శాఖలు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి పదవిని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఒక్కరికే కేటాయించి గౌరవించారు. అలాగే సొంత పార్టీ మంత్రులకూ లక్ష్యాలకు తగ్గట్లు కీలక బాధ్యతలు అప్పగించారు. మిత్రధర్మం పాటిస్తూ ఎన్డీయే కూటమి మంత్రులకు శాఖల కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సొంత నియోజవర్గాలకు వచ్చిన మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీలతో అడుగడుగునా బ్రహ‌్మరంథం పట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మంత్రులు చెప్పారు.
మిత్రధర్మం పాటిస్తూ లక్ష్యాల ప్రాధాన్యతతో మంత్రులకు శాఖలు కేటాయింపు - సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతలు (ETV Bharat) రాష్ట్రంలో మంత్రులకు శాఖలు కేటాయింపు- ఎవరెవరికి ఏ శాఖలంటే? - AP Ministers Portfolios
టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నృత్యాలు చేస్తూ సందడి : మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక వెంకటేశ్వరస్వామి, ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. మంత్రి సంధ్యారాణి తన నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదా - Pawan Kalyan Key Role in Cabinet
ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాల వేసి సంబరాలు :జలవనరులశాఖను మంత్రి నిమ్మల రామానాయుడుకు కేటాయించడం పట్ల పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైతులు హర్షం వ్యక్తం చేశారు. పాలకొల్లులోని లాకుల వద్ద ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాల వేసి సంబరాలు చేసుకున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు రాజమహేంద్రవరంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం పారదర్శకంగా పని చేస్తుందని దుర్గేష్ చెప్పారు.
టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ :రాష్ట్రానికి పరిశ్రమలు తరలివచ్చేలా కృషి చేస్తానని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆయన కర్నూలుకు వచ్చిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మదర్ థెరిస్సా విగ్రహం, ఎస్ బీఐ కూడలి, రాజ్ విహార్ కూడలి మీదుగా టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎన్నికల హామీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన సంబరాలు - చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకాలు - People celebration across the state