ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయాలకు ఆర్థిక వెలుగులు - హర్షం వ్యక్తం చేస్తున్న పూజారులు, భక్తులు - NDA Govt Good News for Priests

ధూప, దీప, నైవేద్యాల సాయం రూ.10వేల పెంపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

NDA_GOVT_GOOD_NEWS_FOR_PRIESTS
NDA_GOVT_GOOD_NEWS_FOR_PRIESTS (ETV Bharat)

NDA Govt Increase Priest Salaries in AP : శరన్నవరాత్రుల వేళ దేవాలయాలకు అసలైన పండుగ శోభను తీసుకొచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం ప్రతి నెలా అందించే సాయాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నిధుల పెంచడంతో ఆలయాల్లో నిత్యం విశేష పూజలు జరగబోతున్నాయి.

5400 ఆలయాలకు చేకూరనున్న ప్రయోజనం : ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు, అర్చకుల వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 35 వేల రూపాయల ఇస్తామన్న హామీని గత ఐదేళ్లు జగన్‌ పట్టించుకోలేదు. చిన్న ఆలయాల అర్చకులు గత ఐదేళ్లు ధూప, దీప, నైవేద్యం కోసం అవస్థలు పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆదాయం లేని ఆలయాలకు 10 వేలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేస్తూ జీవో 216ను విడుదల చేసింది. దీనివల్ల రాష్ట్రంలో 5400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇచ్చిన హామీని నెరవేర్చడం పట్ల పూజారులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

87 వేల ఎకరాల ఆలయాల భూములు అన్యాక్రాంతం - చోద్యం చూసిన జగన్​ సర్కార్​ - Endowment Lands Controversy in AP

అర్చకుడి ఖాతాలో రూ.10వేల జమ : పెంచిన 10 వేల రూపాయల్లో 7వేలు అర్చకుడి భృతిగానూ, 3 వేలు పూజలకు వినియోగించాలని జీవోలో వెల్లడించారు. ప్రభుత్వంపై అదనంగా ఏటా 3240 కోట్ల రూపాయల భారం పడనుంది. ఈ మెుత్తాన్ని దేవాదాయశాఖకు సర్వే శ్రేయోనిధి నుంచి వినియోగించాలని ఉత్తర్వులో తెలిపారు. గుంటూరు జిల్లాలోని 128 ఆలయాలకు ఇప్పటివరకు 6.40 లక్షల రూపాయలు ఇస్తుండగా ఇది 12.80 లక్షలకు పెరిగింది. పల్నాడు జిల్లాలోని 202 ఆలయాలకు గతంలో 10.10 లక్షల రూపాయలు వెచ్చిస్తుండగా ఇప్పుడు 20.20 లక్షలు ఖర్చు చేయనున్నారు. బాపట్ల జిల్లాలోని ఆలయాలకు 24.50 లక్షలు ఇవ్వనున్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ కింద ఉండి ఆదాయం లేని 6 సీ కేటగిరి ఆలయాలకు వర్తింపు చేస్తున్న ఈ పథకాన్ని చిన్న గుడులకు వర్తింపచేయాలని అర్చకులు కోరుతున్నారు.

'ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి' -'దేవాదాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష - CM Chandrababu Review

జగన్‌ చట్టంతో దేవుడి భూములూ గోవిందా - ఆక్రమిస్తే ఆ పైవాడూ కాపాడలేడు! - NO SAFETY FOR ENDOWMENT LANDS

ABOUT THE AUTHOR

...view details