Nandigam Suresh Police Custody on Mariyamma Murder Case : బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవుతాయంటారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో చక్రం తిప్పిన నాటి ఎంపీ నందిగం సురేశ్ తుళ్లూరు పోలీసుస్టేషన్ అడ్డాగా చెలరేగిపోయారు. తప్పుడు కేసులతో టీడీపీ నేతలను ఇబ్బందిపెట్టారు. ఇప్పుడు అదే పోలీసుస్టేషన్‌లో ఓ హత్య కేసులో విచారణకు హాజరయ్యారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ : రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్‌ను పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది.
పోలీసు కస్టడీకి నందిగం సురేష్ - శని, ఆదివారాల్లో విచారణ
నిందితులపై నామమాత్రపు కేసులు : అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ప్రోద్బలంతోనే గొడవ జరిగిందని ఆయన సామాజికవర్గానికి చెందిన వారికి అండగా నిలిచారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి నిందితులపై నామమాత్రపు కేసులు పెట్టేలా చేశారన్నారు. తమకు న్యాయం చేయాలంటూ మరియమ్మ కుటుంబ సభ్యులు ఇటీవల తుళ్లూరు పోలీసులను ఆశ్రయించగా సురేశ్‌పై హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను తుళ్లూరు పోలీసులు విచారించారు.
నందిగం సురేష్‌కు అస్వస్థత - ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యుల నివేదిక
ఏం తెలియదంటూ : మరియమ్మ హత్య కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ రోజు గొడవ జరిగిన విషయం తెల్లారి టీవీలో చూసే వరకు తెలియదని నందిగం సురేశ్ పోలీసులకు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసులో తన పేరు ఇరికించారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో తన బంధువులెవ్వరూ లేరన్న సురేశ్ గొడవ జరగడానికి ముందు వెలగపూడిలో తానెవ్వరికీ ఫోన్ చేసి మాట్లాడలేదని పోలీసులకు సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో తుళ్లూరు స్టేషన్‌లో నందిగం సురేశ్ హవా కొనసాగించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కాదని ఎంపీకి పోలీసులు ప్రాధాన్యమిచ్చేవారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చాలామంది టీడీపీ నాయకులను నందిగం సురేష్ ఇబ్బందులకు గురిచేశాడు. కానీ ఇప్పుడు అదే స్టేషన్‌లో విచారణకు హాజరవ్వడంపై స్థానికులు చర్చించుకున్నారు.
మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ అరెస్ట్ - మహిళ హత్య కేసులో 14 రోజులు రిమాండ్ - NANDIGAM SURESH REMANDED