Municipal Officers Supporting to YCP in Kurnool : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కర్నూలు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారుల తీరు మారలేదు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ నాయకుల సేవలోనే తరిస్తున్నారు. వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికారులు స్వామిభక్తిని చాటుకోవటంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అదానీ కాళ్లు పట్టుకుంటా- కృష్ణపట్నం కంటైనర్ పోర్టును పునరుద్ధరించాలి : ఎమ్మెల్యే సోమిరెడ్డి
ప్రభుత్వం మారిన తీరుమార్చుకోని అధికారులు : ప్రభుత్వం మారినా వైఎస్సార్సీపీ నాయకుల విధానాలతో అంటకాగిన అధికారుల తీరు మారలేదని కర్నూలు ప్రజలు నిట్టూరుస్తున్నారు. నగరంలోని నాలుగో తరగతి ఉద్యోగుల అసోసియేషన్ లేఅవుట్‌కు చెందిన ఎనిమిది ఎకరాల స్థలం కబ్జాకు గురైనప్పటికీ నగరపాలక సంస్థ కమిషనర్ పట్టించుకోలేదు. అక్రమార్కులకు అనుకూలంగా ఆ స్థలాల్లో విద్యుత్ స్తంభాలు, రహదారులు, కుళాయిలు వేసి వారిని ప్రోత్సహించారు. స్థానిక సుందరయ్య పార్కు స్థలంలో ఓ గుత్తేదారు మట్టి, కంకర, ఇసుక నిల్వ చేసి పార్కును సొంత అవసరాలకు ఉపయోగించుకోవడం వివాదాస్పదమైంది. సార్వత్రిక ఎన్నికల ముందు 2 కోట్ల రూపాయలను పలువురు గుత్తేదారులకు చెల్లించగా వారిలో అత్యధికులు వైసీపీ అనుకూలురే ఉన్నారని సమాచారం.
వైసీపీ నేతల పట్ల స్వామి భక్తిని చాటుకుంటున్న అధికారులు : కర్నూలు ముజఫర్‌నగర్‌లోని సర్వే నంబరు 523లో సుమారు 11 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని వక్ఫ్ అధికారులు కార్పొరేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందించలేదని సమాచారం. వైసీపీకు చెందిన నగర మేయర్ బీవై రామయ్య అడుగుజాడల్లో నగరపాలక ఉన్నతాధికారులు నడిచారన్న ఆరోపణలున్నాయి. మేయర్ వార్డుకు అత్యధికంగా రూ.10 కోట్లు నిధులు కేటాయించుకుని మిగతా వార్డులను నిర్లక్ష్యం చేశారని కౌన్సిల్ సమావేశాల్లో వాదనలు వినిపించినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని స్థానికులు ఆరోపించారు. కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు, పన్నుల వసూలు, VLT విధింపు విషయంలో కొందరు ఆర్ఐ లు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. రెవెన్యూ విభాగంలో జరుగుతున్న అక్రమాల తీరుపై ఉన్నతాధికారులకు తెలిసినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
భారీఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు : అక్రమ నిర్మాణాలంటూ షరాఫ్ బజార్‌లో గతంలో మూసివేసిన వ్యాపార దుకాణాలను స్టాండింగ్ కమిటీ ఆమోదంతో మళ్లీ కార్పొరేషన్ అధికారులు తెరిపించడం వివాదాస్పదంగా మారింది. ఆ నిర్ణయం వెనక భారీఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. బిర్లా గేటు సమీపంలోని పైవంతెన కింద ఖాళీ స్థలంలో నగరపాలక సంస్థ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి 'ఖానా ఖజానా' పేరుతో 'ఈట్ స్ట్రీట్' ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం పేరుతో రూ.10 లక్షలు ఖర్చుపెట్టారు. నగరంలో అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి నిబంధనల ఉల్లంఘనల నోటీసులు జారీచేసిన విషయాన్ని అధికారులు గుట్టుగా ఉంచారని స్థానికులు విమర్శించారు.
రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసింది: మంత్రులు - Ministers Review Meetings
కల్కి సినిమాలో చూపించిన ఓల్డ్ టెంపుల్ ఇదే! - ఎక్కడుందో తెలుసా? - Kalki Movie Old Temple in AP
మీరు మారరా.. మీ బుద్ది మారదా? - ప్రభుత్వం మారిన వైసీపీ సేవలో తరిస్తున్న అధికారులు (ETV Bharat)