Mother Died after Death of Son in Ambajipet:మన అనుకున్నవాళ్లు దూరమైతే కలిగే బాధ అంతా ఇంతా కాదు. కొందరికి అది భారమైతే, మరికొందరికి శాపంగా మారుతుంది. ప్రేమానుబంధాల్లో సొంతవాళ్లు మరణిస్తే ఆ బాధ వర్ణానాతీతం. అటువంటి వేదన నుంచి బయటికిరాని కొందరు హఠాత్తుగా మరణించడం గాని ఆత్మహత్యకు పాల్పడటం కాని చేస్తుంటారు. కుమారుడు మృతి చెందడంతో తట్టుకోలేక మనోవేదనకు గురై తల్లి కూడా హఠాన్మరణం చెందింది.
అంబాజీపేటలో విషాద చాయిలు:అంబాజీపేటలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అంబాజీపేటకు చెందిన మద్దింశెట్టి ఆదిబాబు (46) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండటంతో చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడి మృతి వార్త విని తల్లి మహాలక్ష్మి అస్వస్థకు గురయ్యారు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను 108 వాహనంలో చికిత్స కోసం అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే తల్లీ కుమారుడు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విచారంలో మునిగిపోయారు. ఈ ఘటనలో అంబాజీపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి.