Double Murder in Eluru District :నేటి సమాజంలో సాంకేతికతో పాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ నేడు ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఇందుకోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా కడతేర్చడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇద్దరిని దారుణంగా హతమార్చారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన ఏల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. మృతులు రొయ్యూరు భ్రమరాంబ, ఆమె కుమారుడు సురేష్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ భార్య తండ్రి సంవత్సరికం కావడంతో భార్యా పిల్లలను శుక్రవారం ముసునూరులో వదిలి, తల్లి ఒక్కటే ఉంటుందన్న కారణంతో తిరిగి గ్రామానికి వచ్చాడు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.