ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గదిలో వేరే మహిళతో- భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న 'మిస్ వైజాగ్' నక్షత్ర - MISS VIZAG NAKSHTRA - MISS VIZAG NAKSHTRA

Miss Vizag Nakshathra Sensational Comments On Husband Teja : విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ మిస్‌ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తన భర్త ఆ మహిళతో కలిసి ఉండగా మీడియా ప్రతినిధులతో వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Miss Vizag Nakshathra Sensational Comments On Husband Teja
Miss Vizag Nakshathra Sensational Comments On Husband Teja (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 7:12 PM IST

Updated : May 30, 2024, 7:50 PM IST

Miss Vizag Nakshathra Sensational Comments On Husband Teja : విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది. గతంలో మిస్‌ వైజాగ్‌ టైటిల్‌ గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తోంది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భర్త ఆ మహిళతో కలిసి ఉండగా ఆమె మీడియా ప్రతినిధులతో వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తేజ, నక్షత్ర మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. షూటింగ్‌ ఆఫీసు వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ ఆరోపిస్తున్నారు.

ఏలూరులో ప్రేమోన్మాది ఘాతుకం - ప్రేమించలేదని యువతిని నరికి చంపిన యువకుడు - Boyfriend killed his Girlfriend

గదిలో వేరే మహిళతో- భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న 'మిస్ వైజాగ్' నక్షత్ర (ETV Bharat)

నేను గతంలో మిస్ వైజాగ్ టైటిల్ విజేతగా గెలిచాను. 2017లో తేజ అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. కొంతకాలం వరకు కాపురం సజావుగా సాగింది. ఒక పాప కూడా పుట్టింది. ఇంతలో భర్త తేజ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇతర స్త్రీలతో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ధర్మజ్ఞ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడనే సమాచారం నాకు అందింది. మా ఇద్దరికి ఇంకా విడాకులు కాలేదు. కోర్టులో కేసు ఉండగా మరో స్త్రీని ఎలా వివాహం చేసుకుంటారు. తేజ చేస్తున్నది తప్పు. అందుకే నా భర్త ఆ మహిళతో కలిసి దస్పల్లా హిల్స్​లో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వచ్చాను. నన్ను ఇంతలా మోసం చేసిన తేజపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి.- నక్షత్ర, మిస్ వైజాగ్ విజేత

తన కార్యాలయం వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేయడాన్ని తేజ వ్యతిరేకిస్తున్నారు. సినీ ఆడిషన్స్ కోసం వచ్చిన యువతీపై నక్షత్ర ఆరోపిస్తోందని వెల్లడించారు. అలాగే తన ఆఫీసు వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో తేజ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గదిలో ఉన్న ధర్మజ్ఞ అనే అమ్మాయిని అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే తన భార్య ఆరోపణలు సరికాదని తేజా కొట్టిపారేస్తున్నారు.

'భార్యతో గొడవ పడి మద్యం మత్తులో బాంబు బెదిరింపు కాల్'- నిందితుడి అరెస్ట్ - Bomb threat phone call

'మల్లె'కు కలిసిరాని మార్కెట్- వాడిపోతున్న అన్నదాతల ఆశలు - Jasmine Farmers Suffering

Last Updated : May 30, 2024, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details