Minister Manohar Inspected Ration Storage Ware Houses:పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రేషన్ నిల్వ గోదాములను ఆయన తనిఖీ చేశారు. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించారు. అక్కడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది. రేషన్‌లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్లు తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని నాదెండ్ల చెప్పారు.
ఆ శాఖలే నాకు ఇష్టం.. అవే కేటాయించారు: పవన్ కల్యాణ్ - Deputy Chief Minister Pawan
రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని, పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అంతకు ముందు విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం అందులోనూ మంత్రి రంగంలోకి దిగి తనిఖీలు చేయించగా ఒక్కో ప్యాకెట్‌కు 50-100 గ్రాములు తక్కువగా ఉన్నట్లు బయటపడింది. అధికారులు అదేమంత పెద్ద విషయం కాదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా అంటూ సమర్థించుకోవడం వారికే చెల్లుతుంది. ఒక్క తెనాలిలోనే ఇలా ఉందా? మిగిలినచోట్ల కూడా ఇలాగే ఉంటుందా? అని మంత్రి అధికారుల్ని ప్రశ్నిస్తే వారినుంచి సరైన సమాధానం రాలేదు.