ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు - మంత్రి బీసీ జనార్థన్​రెడ్డి - MINISTER INSPECTED ROADS IN ELURU

ఏలూరు జిల్లాలో ఆర్​అండ్​బీ రహదారి పరిశీలన - పీపీపీ పద్దతిలో హైవేల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడి

minister_janardhan_reddy_inspected_roads_from_perikeedu_to_pedapadu
minister_janardhan_reddy_inspected_roads_from_perikeedu_to_pedapadu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 2:01 PM IST

Minister Janardhan Reddy Inspected Roads From Perikeedu To Pedapadu :పిరికిడు నుంచి పెదపాడు మీదగా ఏలూరు వంగాయగూడెం వరకు నిర్మిస్తున్న ఆర్​అండ్​బీ రహదారిని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్​రెడ్డి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. పెదపాడు వద్ద బ్రిడ్జిని పరిశీలించారు. నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఫిబ్రవరి నాటికి గుంతలు లేకుండా రోడ్లను నిర్మించనున్నట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏలూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.1,080 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఇంతవరకు 21,220 కి.మీ. మేర రోడ్లపై గుంతలను పూడ్చినట్లు చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి రూ.11,468 కోట్లు వెచ్చించిందని గుర్తుచేశారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రూ.16,582 కోట్లు కేటాయించి, రూ.7,334 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందన్నారు. 12,653 రాష్ట్ర రహదారులుండగా వాటిలో 10,200 కి.మీ. మేర పీపీపీ పద్ధతిలో నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అంతకుముందు జిల్లాలో రహదారుల నిర్మాణ ప్రగతిపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి తిలకించారు.

ఇక ఆ బైపాస్​పై వాహనాలు రయ్​రయ్ - ఏప్రిల్ నాటికి పాక్షికంగా అందుబాటులోకి!

10 వేల 200 కిలోమీటర్ల హైవేను పీపీపీ పద్దతిలో నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లాలో పర్యటించిన ఆయన ఏలూరు –పెరికేడు మధ్య జరుగుతున్న ఎస్​డీబీ (SDB) రోడ్ల పనులను పరిశీలించారు. దెందులూరు ఎమ్మల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి పెదపాడు మండలంలో పర్యటించారు. S.D.B. రోడ్ల పనులు జరుగుతున్న తీరుపై అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి పలు సూచనలు చేశారు.

ఏపీలో మెగా సిటీలుగా ఆ ప్రాంతాలు - అమరావతి ఓఆర్‌ఆర్​తో మారనున్న రూపురేఖలు

ABOUT THE AUTHOR

...view details