ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యుత్ ఛార్జీలను పెంచాలని సిఫార్సు చేసింది జగనే - ఇది తుగ్లక్ చర్యలకు పరాకాష్ట' - MINISTER GOTTIPATI FIRE ON JAGAN

వైఎస్సార్సీపీ ఆందోళనలపై విరుచుకుపడ్డ మంత్రి గొట్టిపాటి - వారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వాళ్లే ధర్నాకు పిలుపునివ్వడం ఏంటని ప్రశ్న

Minister Gottipati Fire On YS Jagan Due To Power Charges Strike Call
Minister Gottipati Fire On YS Jagan Due To Power Charges Strike Call (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2024, 3:21 PM IST

Minister Gottipati Fire On YS Jagan Due To Power Charges Strike Call : విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణమైన జగన్‌రెడ్డి తిరిగి ఆందోళనలకు పిలుపునివ్వడం తుగ్లక్ చర్యలకు పరాకాష్ట అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.ప్రపంచంలో ఈ తరహా వింత పోకడ ఎక్కడా ఎవరూ చూసి ఉండరని దుయ్యబట్టారు. మోపిన విద్యుత్ భారానికి ప్రజలు జగన్ ఇంటి ముందు ధర్నా చేయాల్సి ఉండగా, ఆయన కలెక్టరేట్లలో ధర్నాకు పిలుపునివ్వటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఒకసారి ప్రజల్ని మోసం చేసి అందలం ఎక్కిన జగన్‌రెడ్డి ప్రతిసారీ అలాగే చేయాలనుకుంటే కుదరదన్నారు.

సిఫార్సు చేసింది జగన్ కాదా? : చేసిన తప్పులను ఇప్పటికీ సరిదిద్దుకొని జగన్ మాటలకు విశ్వసనీయత ఎక్కడుందని మంత్రి గొట్టిపాటి రవి నిలదీశారు. పదవి నుంచి దిగిపోయే ముందు కూడా ప్రజల మీద విద్యుత్ భారం మోపాలని ఈఆర్సీ(ERC)కి సిఫార్సు చేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసునన్నారు. విద్యుత్ ఛార్జీలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మండలిలో ప్రభుత్వం సమాధానం ఇస్తుంటే వాకౌట్ వంకతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు పారిపోయారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం 2019లో రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఇచ్చి వెళ్తే, జగన్ వచ్చాక విద్యుత్ రంగ వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశాడో అందరికీ తెలుసునని విమర్శించారు.

వైఎస్సార్సీపీ దెబ్బకు భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు - భారం మోపకుండా ఏం చేయాలి?

నాటి పాపాలే - నేడు శాపాలు : విద్యుత్ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన పీపీఏలు రద్దు చేసి, పారిశ్రామికవేత్తలను తరిమేశాడని గుర్తు చేశారు. తన అనుయాయులకు దోచి పెట్టేందుకు అధిక ధరలతో ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేశారని గొట్టిపాటి రవి ఆరోపించారు. విద్యుత్ రంగంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన రాష్ట్రాన్ని రివర్స్ పాలనతో అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాడని ఆక్షేపించారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిదేనని విమర్శించారు. సీఎంగా జగన్ చేసిన నాటి పాపాలే ప్రజలకు ఇప్పుడు శాపాలుగా మారాయని వెల్లడించారు.

సౌర విద్యుత్​ ఒప్పందాలపై ఎస్ఈ​ఆర్​సీ విచారణకు హైకోర్టు ఆదేశం

పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రజలు ఆగ్రహం - ట్రూఅప్‌ ఛార్జీలు ఎత్తివేయాలని డిమాండ్

ABOUT THE AUTHOR

...view details