Minister and MP Review on Godavari Pushkaralu 2027:అఖండ గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో పెట్టుకొని తూర్పు గోదావరి జిల్లాను యూనిట్‌గా తీసుకొని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు చేపట్టనున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, మునిసిపల్ కమీషనర్ కేతాన్ గార్గ్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, బత్తుల బలరామ కృష్ణ పాల్గొన్నారు.
విజన్ 2047 తరహాలోనే పుష్కరాలు:రానున్న అఖండ గోదావరి పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి విజన్ 2047 తరహాలోనే గోదావరి పుష్కరాలు 2047కు విజనరీతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నిధులను సమీకరించుకుని, సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగిందని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఘాట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు.
'జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి' - వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగలేఖ