Mangalagiri SI Sold his Vote in AP Elections 2024 : ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) పోలీసుల తీరు ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఇప్పటికే డీజీపీ స్థాయి నుంచి ఎస్సై వరకు ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈసీ చర్యలతో పోలీసుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసు అధికారుల వరుస బదిలీలు, సస్పెన్షన్లు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఒక ఎస్సైకి వైఎస్సార్సీపీ నాయకులు రూ.5 వేలు ఇచ్చి ఓటు వేయించుకున్న వ్యవహారం వెలుగు చూసింది. డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన ఎస్త్సె ఏకంగా ఓటు అమ్ముకుని వార్తల్లో నిలిచారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత - హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు
ఓటును అమ్ముకున్న మంగళగిరి ఎస్సై : రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ వైసీపీ చేసిన అవినీతి, అక్రమాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది అధికారులు ఏకపక్షంగా అధికార పార్టీకి కొమ్ముకాశారని తేలిపోయింది. ఒక ఎస్సైకి వైఎస్సార్సీపీ నాయకులు రూ.5 వేలు ఇచ్చి ఓటు వేయించుకున్న వ్యవహారం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన ఖాజాబాబు మంగళగిరిలో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు దర్శిలో ఓటు ఉంది. వైఎస్సార్సీపీ నాయకులు ఈయన ఓటుకు ఖరీదు కట్టి రూ.5 వేలను ఫోన్‌పే ద్వారా ఖాజా బాబు ఖాతాకు పంపారు. అనంతరం, ఆయన తన ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపించారు.
'ఆయ్‌అండీ, మావాడే గెలుస్తాడండి ' బెట్ ఎంతండీ? ఇదీ గోదావరి జిల్లాల పందెం రాయుళ్ల తీరు!
ఓటుకు రూ.5 వేలు తీసుకున్న ఎస్సై :ఓటుకు నోటు తీసుకున్న విషయాన్ని పసిగట్టిన టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దర్శి పోలీసులు ఈ నెల 7న ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. దీనిపై జిల్లా అధికారులు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఎస్సై ఖాజా బాబు ఓటుకు రూ.5 వేలు తీసుకున్నట్లు ఆధారాలు లభించటంతో గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారే ఓటుకు నోటు తీసుకున్నట్లు తెలిసి జనం విస్తుపోతున్నారు.
పోలీసు అధికారుల వైఖరి చూసి విస్తురుపోతున్న జనం :దేశ చరిత్రను తిరగరాసే ఆయుధం ఓటు. ఒక దేశం ఎలా ఉండాలో ఓటు నిర్ణయిస్తుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, తమ వైపు తిప్పుకోవడానికి పార్టీలు, నాయకులు పెద్ద ఎత్తున కానుకలు అందిస్తుంటారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్ది ఓటర్లకు తాయిలాలు అందిస్తుంటారు. ఇందులో ప్రధానంగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం ఒకటి. ఓటును అమ్మకోవద్దు, డబ్బు తీసుకోవద్దు, పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఎన్ని చెప్పినా రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ మాత్రం అధికార దాహంతో ఎలాగైన ఎన్నికల్లో నెగ్గాలని ఓటర్లకు తాయిలాయి ఇచ్చింది. ఆ గాలంలో పడి చివరికి ఓటుకు నోటు తీసుకోకూడదని చెప్పాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ ఓటును అమ్మకానికి పెడుతున్నారు. నేతలు ఇచ్చే కాసులకు ఆశపడి ఓటును అమ్మేసుకుంటున్నారు.
ఈవీఎంలకు కేంద్ర బలగాల బందోబస్తు: పోలీస్ కమిషనర్ - Tight Security At EVM Strong Rooms