ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎంపీ అవినాశ్ కాన్వయ్​లో నా వాహనాలు - అడిగితే చంపుతామంటున్నారు' - MP AVINASH REDDY CONVOY

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్​కు తెలంగాణ వ్యక్తి ఫిర్యాదు - టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరణ

Complaint on MP YS Avinash Reddy
Complaint on MP YS Avinash Reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 9:09 AM IST

Complaint on MP YS Avinash Reddy :'తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌కు చెందిన మణిరాజ్‌ అనే వ్యక్తికి 2021 ఏప్రిల్‌లో 5 కార్లను అద్దెకు ఇచ్చాను. అతను అద్దె చెల్లించకుండా మోసం చేయడంతో పాటు నా కార్లను కడప జిల్లాలోని పులివెందుల వైద్య కళాశాలకు లీజుకు ఇచ్చారని తెలిసింది. ఆయనపై సంగారెడ్డి పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టాను. కార్ల కోసం అప్పటి వేంపల్లి ఎస్‌ఐని కలిశాను. ఆయన వైఎస్సార్సీపీ నేతలతో మాట్లాడాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి (MP YS Avinash Reddy) అనుచరులైన జడ్పీటీసీ సభ్యుడు రవి కుమార్, మాజీ సర్పంచ్‌ శంకర్‌ రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి వద్దకు నన్ను పంపారు. వారంతా నన్ను తీవ్రంగా కొట్టి, కార్లు అడిగితే చంపేస్తామని బెదిరించారు.'

'అనంతరం పోలీసులకు అవినాష్‌రెడ్డి ఫోన్‌ చేయడంతో వారు నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రుణాలు ఇచ్చిన సంస్థలు నాపై కేసులు పెట్టి చెల్లింపుల గురించి ఒత్తిడి చేయడంతో ఆరు నెలల తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లాను. ఇడుపులపాయలోని ఓ గదిలో 5 రోజులు నన్ను బంధించి చిత్రహింసలు పెట్టారు. నన్ను చంపేయాలని ఫోన్‌లో మాట్లాడుకున్నారు. భయాందోళనలకు గురై అక్కడి నుంచి తప్పించుకున్నాను. ప్రస్తుతం నా కార్లు ఎంపీ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌లో ఉన్నాయి. వాటిని తిరిగి ఇప్పించాలి’ అని తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన సతీష్‌ కుమార్‌ అర్జీ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.

మా ఇద్దరిపైనా అత్యాచారయత్నం :'మా ఎదురింట్లో ఉండే గంజాయి వ్యసనపరుడు నా 12 ఏళ్ల కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. వారు పట్టించుకోకపోగా మాతో నీచంగా ప్రవర్తించారు. మాపై ఫిర్యాదు చేస్తావా అంటూ ఎదురింటి వ్యక్తి, అతని తల్లి మాపై దాడులు చేశారు. అతను రెచ్చిపోయి ప్రతిరోజూ ఇంట్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మా ఇద్దరిపైనా అత్యాచారయత్నం చేశాడు' అని విజయవాడకు చెందిన ఓ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించాలని కోరారు.

పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన కరోనా విరాళాలు రూ. 240 కోట్లు అవినాష్ రెడ్డికి ఇచ్చారు: పెమ్మసాని చంద్రశేఖర్ - Pemmasani Comments on YS Jagan

భూమిని తిరిగి అప్పగించండి :'మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి బంధువు బుగ్గారెడ్డి నా భూమిని కబ్జా చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరించారు. భూమిని తిరిగి అప్పగించి నాకు న్యాయం చేయండి' అని నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన సురేష్‌ ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారు :తన భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని, ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కృష్ణా జిల్లా జి.కొండూరుకు చెందిన సామ్రాజ్యం అనే మహిళ వాపోయారు.

స్వదేశానికి తీసుకురండీ :'పని చూపిస్తానంటూ నా భార్యను మస్కట్‌ తీసుకెళ్లారు. అక్కడ తిండి పెట్టకుండా ఏజెంట్‌ ఇబ్బందులు పెడుతున్నాడు. తిరిగి స్వదేశానికి పంపాలని కోరితే డబ్బు డిమాండ్‌ చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే నా భార్య ఆరోగ్యం క్షీణించింది' అని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రాజశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు అదుపులో వర్రా రవీందర్‌రెడ్డి - రహస్యంగా విచారణ

చంపేస్తామని బెదిరిస్తున్నాడు :అప్పుగా ఇచ్చిన రూ.32 లక్షలను తిరిగి చెల్లించాలని కోరితే వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని విజయవాడకు చెందిన కృష్ణా రెడ్డి వాపోయారు. పైగా తనను, కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

మా భూమిపై కన్నేశారు :'ఉపాధి కోసం మరో ఊరికి వెళ్లడంతో వైఎస్సార్సీపీ నాయకులు మా భూమిపై కన్నేశారు. వారి సహకారంతో అధికారులు ఆ భూమిని వేరే వారికి అప్పగించారు. మా భూమిని తిరిగి మాకు ఇప్పించండి' అని ప్రకాశం జిల్లా చిన్నగుడిపాడుకు చెందిన రమణబాబు కోరారు.

ఆసుపత్రిని నిర్మించాలి :ఉద్యోగ విరమణ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లే సీజీహెచ్‌ఎస్‌ దూరంగా ఉందని, కర్నూలులో మరో ఆసుపత్రిని నిర్మించాలని టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబురాజు కోరారు.

పంచ్‌ ప్రభాకర్‌పై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details