ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలం వివాదం - ట్రాక్టర్‌తో తొక్కించబోయారు - చివరకు ఏం జరిగిందంటే! - LAND ISSUES LEADS TO FIGHT

పొలం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం- ఆసుపత్రి పాలైన ముగ్గురు వ్యక్తులు

land_issues_leads_to_fight_in_two_families_in_Nellore
land_issues_leads_to_fight_in_two_families_in_Nellore (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2024, 3:07 PM IST

Fight Between Two Families About Land Issue in Nellore District :పొలం వివాదంలో ఓ కుటుంబంపై మారణ ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోల్లపునాయుడుపల్లిలో భూవివాదం మారణాయుధాలతో దాడికి దారి తీసింది. పొలం విషయంలో శివశంకర్‌రెడ్డి, ఓబుల్ రెడ్డి కుటుంబాల మధ్య వివాదం నడుస్తుంది. శివశంకర్ రెడ్డి తన పొలంలో పంట వేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఆ పొలం తమదంటూ ఓబుల్ రెడ్డి వర్గం శుక్రవారం ట్రాక్టర్‌తో పంట దున్నేశారు. అడ్డుకోబోయిన శివశంకర్ రెడ్డి కుటుంబీకులను ట్రాక్టర్‌తో తొక్కించబోయారు. వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది సివిల్‌ కేసు అని కోర్టులో తేల్చుకోవాలని చెప్పి పోలీసులు పంపించేశారు. మరుసటి రోజు ఓబుల్ రెడ్డి వర్గం మారణాయుధాలతో శివశంకర్ రెడ్డి ఆయన భార్య శారద, కుమారుడు గణేష్‌పై దాడి చేశారు. దాడిలో శివశంకర్ రెడ్డి తల పగిలి తీవ్రంగా గాయాలయ్యాయి. ముగ్గురిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్‌తో చంపడానికి వచ్చిన వారిపై ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు స్పందించి ఉంటే ఇవాళ ఈ దాడి జరిగేది కాదని శివశంకర్ రెడ్డి భార్య శారద వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details