Kodi Kathi Srinu expressed gratitude:జనిపల్లి శ్రీను దళితుడు కాబట్టి కోడికత్తి శ్రీను అని పిలుస్తున్నారని, ఆదే సీఎం జగన్ను గొడ్డలి జగన్ అని ఎవరైనా పిలవగలరా అని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లి అన్నారు. తాము, సమత సైనిక్ దళ్ సహకారంతో ఒక ప్రణాళిక బద్దంగా ప్రయత్నం చేయడం వల్లే నేడు కోడికత్తి శ్రీనుకు బెయిల్ వచ్చిందన్నారు. ఈ కేసులో శ్రీనుకు న్యాయం జరిగేవరకూ తామంతా శ్రీను కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
సహకరించిన వారికి ధన్యవాదాలు: తనకు బెయిల్ రావడంలో సహకరించిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లి, సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబును కలిసిన కోడికత్తి శ్రీను, వారికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయానికి విచ్చేసిన జనిపల్లి శ్రీను, ఆయన కుటుంబ సభ్యులు ఫరూక్ షిబ్లికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహన్ని బహుమతిగా అందించారు. తనకు బెయిల్ రావడం కోసం కృషి చేసిన వారంధరికి శ్రీను ధన్యావాదాలు తెలిపారు.
'జగన్ దళితుల మనిషి అయితే కోడికత్తి కేసులో కోర్టుకు ఎందుకు రావట్లేదు'
జగన్ ను గొడ్డలి జగన్ అనగలరా?: రాష్ట్రంలో దళిత, ముస్లింల ఐక్యతకు కోడి కత్తి శ్రీను పునాదిగా మారారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లి తెలిపారు. సమత సైనిక్ దళ్ సహకారంతో ఒక ప్రణాళిక బద్దంగా ప్రయత్నం చేయడం వల్లే నేడు న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందని ఫరూక్ షిబ్లి పేర్కొన్నారు. కోడి కత్తి శ్రీను దళితుడు కనుక అలా పిలుస్తున్నారు. అదే జగన్ ను గొడ్డలి జగన్ అని ఎవరైనా అనగలరా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వల్ల చనిపోయిన డ్రైవర్ సుబ్రమణ్యం తల్లిదండ్రులు న్యాయం కోసం చూస్తున్నారని, వారి న్యాయం జరిగేలా తాము కృషి చేస్తామన్నారు.