Karimnagar Fire Accident Today : కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న పూరిళ్లలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఆ ఇళ్లలో ఉన్న పది గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో మంటలు(Fire Accident) ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. భయందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఘటనస్థలాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar ) పరిశీలించారు.
నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం
"ఈ పూరిళ్లలో నివాసం ఉంటున్న ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వేగంగా స్పందించి వారికి పక్కా గృహాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మా పార్టీ పరంగా కూడా బాధితులను ఆదుకుంటాం. తక్షణమే రూ.లక్ష పరిహారం ఇవ్వాలని కోరుతున్నాను." - గంగుల కమలాకర్, మాజీ మంత్రి
Subhash Nagar Fire Accident in Karimnagar : ఆదర్శనగర్‌లో వడ్డెర కులస్థులు గత 20 సంవత్సరాల నుంచి పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. గిరిజన దేవత సమ్మక్క సారమ్మ జాతర ఉండటంతో మేడారంకు వెళ్లే ముందు తమ ఇళ్లలో అమ్మవారి ముందు దీపాలు వెలిగించారు. దాదాపు 20 వరకు గుడిసెలు ఉండగా ఈ గుడిసెలలో 200 మంది వరకు ఉంటారు.