Jeedipally Peruru Project in Satya Sai District :తెలుగుదేశం హయాంలో పరుగులు పెట్టిన జీడిపల్లి- పేరూరు అనుసంధాన ప్రాజెక్ట్ ప్రస్తుతం పడకేసింది. అంతకన్నా మిన్నగా నిర్మించి 8 మండలాల్లో 75 వేల ఎకరాలకు నీరిస్తామని ఊదరగొట్టిన సీఎం జగన్ శంకుస్థాపనలతోనే సరిపెట్టారు. అయిదేళ్లవుతున్నా తట్ట మట్టి ఎత్తలేదు సరికదా, కనీసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండానే ఇప్పుడు మరోసారి బస్సుయాత్ర పేరిట ఓట్లు అడగడానికి వస్తున్న సీఎం జగన్‌పై రైతులు మండిపడుతున్నారు.
ఉత్తరాంధ్రపై మాటల్లోనే జగన్ ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే
YCP Government Neglected the Jedipalli-Peruru Project :ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు, ఓట్లు వేసిన తర్వాత జనాన్ని వదిలేయడం సీఎం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఉచిత హామీలిచ్చి ప్రజల్లో ఆశలు రేకెత్తించడం, ఆనక ఉసూరుమనిపించడంలో ఆయనకు సాటిరారెవ్వరు. ఇదిగో కుళాయి తిప్పాం నీళ్లు వచ్చేస్తున్నాయన్న రీతిలో ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి పంటపొలాలకు సాగునీరిస్తామని గొప్పలు చెప్పారు. 2020 డిసెంబర్ 9న శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద జీడిపల్లి జలాశయం-పేరూరు అనుసంధానం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన జగన్ సత్వరం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఎనిమిది మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. మూడేళ్లవుతున్నా తట్ట మట్టి ఎత్తలేదు. ఈ ఒక్క పథకంపైనే జగన్ మూడుసార్లు హామీలిచ్చినా కార్యరూపం దాల్చలేదు. నిధులు కేటాయించకుండా భూసర్వే, డిజైన్లు పేరిట కాలయాపన చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా మళ్లీ బస్సు యాత్ర పేరిట ఎందుకొస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
అభివృద్ధి కోసం అయితే అప్పు వద్దు - జగన్ సర్కార్ తీరుపై అధికారుల విస్మయం
వాస్తవానికి జీడిపల్లి- పేరూరు ప్రాజెక్ట్‌కు 2018లోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది. రూ.803 కోట్లకు పరిపాలన అనుమతులనిచ్చి రూ.565 కోట్లకు టెండర్లనూ పిలిచింది. 37 కి.మీ. కాలువ పనులూ పూర్తయ్యాయి. నాలుగు పంపుహౌస్‌ల నిర్మాణాన్నీ మొదలుపెట్టారు. అప్పట్లోనే 988 ఎకరాల భూమి సేకరించారు. కొంత భూమికి పరిహారం సైతం చెల్లించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడి అక్కడ నిలిచాయి. వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు నమూనాను మార్చేసింది. టీడీపీ హయాంలో చేపట్టిన పుట్టకనుమ రిజర్వాయరును రద్దు చేసింది. రూ. 803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలు నిర్మిస్తామని ప్రకటించింది.
హంద్రీనీవాలో భాగంగా నిర్మించిన జీడిపల్లి జలాశయం నుంచి పేరూరుకు కృష్ణా జలాలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ జలాశయం నుంచి పేరూరుకు ఎత్తిపోతల ద్వారా మూడు నెలల్లో 7.2 టీఎంసీలను తీసుకెళ్లాలని నిర్ణయించారు. 53 కిలోమీటర్ల ప్రధాన కాలువపై నాలుగు ఎత్తిపోతలు, 110 కాంక్రీటు కట్టడాలు చేపట్టాల్సి ఉంది. అయిదేళ్లలో ఈ పనుల్లో ఏ ఒక్కటీ ముందుకు సాగలేదు.
'రాష్ట్రమంతా కరవు తాండవం' - నదుల అనుసంధానంపై ఊసెత్తని వైఎస్సార్సీపీ ప్రభుత్వం
తెలుగుదేశం హయాంలో ఈప్రాజెక్ట్ పరుగులు పెట్టించారు. 53 కి.మీ. ప్రధాన కాలువను దాదాపు పూర్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిహారం పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి హామీనిచ్చారు. అయిదేళ్లు పూర్తయి మళ్లీ ఎన్నికలు వస్తున్నా సొమ్ము జమ చేయలేదు. నాలుగు ప్రాజెక్టుల నిర్మాణానికి 13 గ్రామాల రైతులు భూములిస్తున్నారు. ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారుల నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో రైతులు ఒప్పుకోవడం లేదు. ఈ అయిదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణానికి రూపాయి కేటాయించలేదు. ఇప్పుడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నందున గతంలో తాను ఇచ్చిన హామీలపై ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశమైంది.
ఐదేళ్లుగా భూ సర్వే, డిజైన్లకే పరిమితం - జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు ఊసెత్తని జగన్ Anantapur District :అనంతపురం జిల్లా గుత్తి పురపాలికతోపాటు బసినేపల్లిలో తాగునీటి సమస్య తీరుస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. దాహంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గుత్తిలో నెలరోజులకు ఓసారి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. పామిడి సమీపంలోని పెన్నా నుంచి రోజుకు 30 లక్షల లీటర్ల నీరు రావాల్సి ఉన్నా కేవలం పది లక్షల లీటర్లే అందుతున్నాయి. ఈ నీరు ఏమూలకూ సరిపోవడం లేదు. గార్లదిన్నె ఎంపీఆర్ డ్యామ్‌లో తుంగభద్ర జలాలను నిల్వ ఉంచి పైపులైన్ ద్వారా గుత్తికి అందించాలని తెలుగుదేశం హయాంలో పథకం రూపొందించారు. పథకం మంజూరై అయిదేళ్లు గడిచినా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. టీడీపీకి మంచి పేరు వస్తుందని మూలన పడేశారు.