ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని సీఈవోకు జేడీ విజ్ఞప్తి - JD And Vijayakumar Complaint to EC

JD And Vijayakumar Complaint to EC Against Volunteers: వాలంటీర్లు, మెప్మా వారిని ఇతర ప్రాంతాలకు బదిలీలు చేయాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్​ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సీఈవోకు నేతలు విజ్ఞప్తి చేశారు.

JD And Vijayakumar Complaint to EC
JD And Vijayakumar Complaint to EC

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 7:34 PM IST

JD And Vijayakumar Complaint to EC Against Volunteers: వాలంటీర్లపై ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్​లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు, మెప్మా వారిని ఇతర ప్రాంతాలకు బదిలీలు చేయాలని నేతలు సీఈవోను కోరారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని జేడీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నికలను ఒక యుద్ధంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. మద్యం, నగదు విక్రయాలపై తగిన చర్యలు తీసుకోవాలని సీఈవోను ఇరుపార్టీ నేతలు కోరినట్లు తెలిపారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమలు చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని జేడీ కోరారు.

పింఛన్ల నిధులను బిల్లులకు చెల్లించారు- పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షంపై విషప్రచారం: టీడీపీ నేతలు - pension distribution in ap

సస్పెండ్ చేస్తున్న వాలంటీర్​లు ఇప్పుడు బాహాటంగా అధికార పార్టీ కోసం పని చేస్తున్నారని నేతలు స్పష్టం చేశారు. వాలంటీర్లను ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ లాంటి దూర ప్రాంతాలకు బదిలీ చేయాలని సీఈవోను జేడీ కోరారు. ఎక్కడ ఉన్న వాలంటీర్లు అక్కడే ఉంటే పారదర్శకంగా ఎన్నికలు జరగవని సీఈవోకు వివరించారు. రాష్ట్రంలో ఫ్లయింగ్ స్క్వాడ్​లు నిఘా పెట్టినా డబ్బు పంపిణీనీ అరికడుతున్న దాఖలాలు కనిపించడం లేదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ కుమార్ స్పష్టం చేశారు.

పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోండి - సీఎస్​కు లేఖరాసిన నిమ్మగడ్డ - Nimmagadda writes letter to CS

ప్రస్తుత పార్టీలు గత ఎన్నికల కంటే ఈసారి మరింత ఎక్కువ ఖర్చు చేస్తాయని తెలిపారు. గతంలో ఓటుకు రెండు వేలు పంపిణీ చేయగా ఈసారి ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం విక్రయాలను నగదు రూపంలో కాకుండా డిజిటల్​గా తీసుకోవాలని సీఈవోను కోరిన్నట్లు వివరించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపించాలని సీఈవోను కోరామని తెలిపారు. రైతు భరోసా లాంటి పథకాలు ఒక్క బటన్ నొక్కి ఇవ్వగలిగినప్పుడు పెన్షన్ కూడా ఒక్క బటన్ తోనే ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు.

పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ అన్ని నగదు పంపిణీ పథకాల నుంచి వారిని దూరంగా ఉంచాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవోను ఈసీఐ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది.

సీఈసీ ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులు - వైసీపీ ప్రచారంలో! - Govt Employees Violating CEC Orders

ABOUT THE AUTHOR

...view details