ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్​పై వాదనలు పూర్తి - తీర్పు వాయిదా - JANI MASTER VERDICT POSTEPONED

ఈ నెల 14న తీర్పు వెలువరించనున్న రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు

JANI_MASTER_VERDICT_POSTEPONED
JANI_MASTER_VERDICT_POSTEPONED (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2024, 5:29 PM IST

Jani Master Verdict Posteponed :ప్రముఖ కొరియోగ్రాఫర్​ షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీమాస్టర్‌ బెయిల్​ పిటిషన్​పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. బెయిల్​ పిటిషన్​పై ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది.

Jani Master Verdict Posteponed for Wednesday : జానీ మాస్టర్‌ 5 రోజుల కస్టడీ కోసం నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును ఈరోజుకు (బుధవారానికి) వాయిదా వేసిన విషయం అందరికి తెలిసిందే. జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌పై కూడా ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి కోర్టు అక్టోబర్​ 14కు వాయిదా వేసింది.

అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి? - నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్‌ సతీమణి - Jani Master Wife Comments

Jani Master Issue:తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని, ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టాడంటూ సహాయ కొరియోగ్రాఫర్‌ సెప్టెంబర్​ 15న హైదరాబాద్​లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నార్సింగి ఠాణాకు బదిలీ చేశారు. బాధితురాలి వాంగ్మూలం సేకరించిన పోలీసులు యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి లైంగిక దాడి జరుగుతున్నట్లు నిర్థారించుకుని ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా పోక్సో సెక్షన్‌ను చేర్చారు.

జానీమాస్టర్‌ వ్యవహారం తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశం కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం కలకలం రేపింది. నార్సింగ్ పోలీసులు తొలుత ఫోన్‌ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మణికొండలోని నివాసానికి పోలీసులు వెళ్లి ఆరా తీయగా ఇంట్లోనూ లేరు. పనిమనిషిని ప్రశ్నించగా జానీ మాస్టర్‌ చెన్నై వెళ్లినట్లు చెప్పారు. కేసు నమోదైన తర్వాత సినిమా షూటింగ్‌ల కోసం నెల్లూరు, లద్దాఖ్‌ ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు భావించి ఆరా తీసినా ఆచూకీ మాత్రం చిక్కలేదు.

లైంగిక వేధింపుల ఆరోపణలు - కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​కు తెలుగు ఫిలిం ఛాంబర్ షాక్ - Film Chamber reacts on Jani Master

పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ :పరారైనట్లు నిర్థారించుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలించగా గోవాలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో నిర్థారించుకున్నారు. పెద్ద హోటళ్లలో ఉంటే ఆచూకీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో జానీ మాస్టర్‌ ఒక చిన్నహోటల్‌లో తలదాచుకున్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన రాజేంద్రనగర్‌ ఎస్వోటీ పోలీసుల బృందం హైదరాబాద్​ నుంచి గోవాకు బయల్దేరింది. అక్కడ జానీమాస్టర్​ను అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ తీసుకువచ్చారు.

జానీ మాస్టర్​పై లైంగిక ఆరోపణలు - పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టిన జనసేన - RAPE CASE AGAINST JANI MASTER

ABOUT THE AUTHOR

...view details