Pawan Kalyan met TDP leaders and activists:కాకానాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలతో భేటీ అవుతున్నారు. ఆయా వర్గాలతో సమావేశాలు నిర్వహించి మద్దతు కూడగడుతున్నారు. అందులో భాగంగా నేడు కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నాయకులను ఇన్‌ఛార్జి వర్మ పవన్‌కు పరిచయం చేశారు. అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కలిసి పనిచేయాలని నాయకులు సంకల్పం చేశారు.
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి వర్మ, నాయకులు త్యాగం చేసి తనకు సీటు కేటాయించారని, గెలిచి అందరి రుణం తీర్చుకుంటానని పవన్ స్పష్టంచేశారు. చంద్రబాబుని జగన్ అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టిస్తే, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అని మనస్ఫూర్తిగా 'టీడీపీకి, చంద్రబాబుకు మద్దతు తెలిపానని గుర్తుచేశారు. కొత్తపల్లి, ఉప్పాడ మత్యకారుల సమస్యలపై కూటమి నిర్వహించే సభలో మాట్లాడుతామని తెలిపారు. తాను పోటీ చేస్తున్నా.. వర్మ, నేను పోటీ చేస్తున్నట్లుగా గుర్తించాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అందుకే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉధయ్ కుమార్ ను సైతం భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పవన్ కల్యాణ్‌పై జగన్ వాఖ్యలను ఖండించిన జనసేన - సీఈఓకు ఫిర్యాదు - Janasena Leaders Complain to CEO
‘పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నా. నన్ను చాలా గౌరవిస్తున్నారు.. ఆయన రుణం తీర్చుకుంటా. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే ఆయనకు మద్దతిచ్చా- 'పవన్ కల్యాణ్ , జనసేన అధినేత