IPS Officers Transfers in Andhra Pradesh: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎస్పీలను మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కోన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై గతంలో దురుసుగా ప్రవర్తించిన గరుడ్ సుమిత్ సునీల్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్‌ను నియమించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపికను బదిలీ చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్నను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వీ మాధవరెడ్డిని నియమించారు. కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్‌ను నియమించిన ప్రభుత్వం, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌కి గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్‌ను నియమించారు. అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ డూడీని బదిలీ చేశారు. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 1గా అజితా వేజెండ్లను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హాను నియమించారు. తూర్పుగోదావరి ఎస్పీగా డి.నరసింహ కిషోర్,
అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి.విద్యా సాగర్ నాయుడులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.కె. మీనా నియామకం - MK Meena to Excise Department