AP Ministers in Independence Day: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా స్థాయిల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. గుంటూరు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ జాతీయ జెండాను ఎగురవేస్తారని స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు, మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, పల్నాడు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్లు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అలాగే నెల్లూరులో మంత్రి నారాయణ, అనకాపల్లిలో హోం మంత్రి అనిత, చిత్తూరు జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్, పశ్చిమ గోదావరిలో మంత్రి నిమ్మల రామానాయుడు, కడప జిల్లాలో మంత్రి ఫరూఖ్, తిరుపతి జిల్లాలో మంత్రి రామనారాణ రెడ్డి జాతీయ జెండాకు గౌరవవందనం సమర్పించనున్నారు.
అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్, విశాఖ జిల్లాలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏలూరు జిల్లాలో మంత్రి పార్ధసారధి, ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్, పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్ధన రెడ్డి, కర్నూలు జిల్లాలో మంత్రి టీజీ భరత్, సత్యసాయి జిల్లాలో మంత్రి ఎస్.సవిత జాతీయ జెండాను ఎగురవేస్తారని ప్రభుత్వం తెలిపింది.