DANGEROUS TRAVELING :ఏ ఆటోపైనా అయినా ‘4 ఇన్ ఆల్’ అని ఉంటుంది. అంటే దాని ప్రయాణ సామర్థ్యం డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురని అర్థం. కానీ, ఆ విషయాన్ని డ్రైవర్ నెల్లూరు ఆటోవాలా మరిచిపోయారు. 25 మంది విద్యార్థినులను ఆటోలో కుక్కారు. డ్రైవర్ ఓ పక్కన నలుగురు, మరోవైపు ముగ్గురు, వెనుక ఐదుగురు, మధ్యలో 12 మంది విద్యార్థినులు ఉన్నారు. డ్రైవర్‌తో కలిపి మొత్తం 25 మంది ఆ ఆటోలో ప్రయాణిస్తున్నారు.
"ఆటో"పై 4 ఇన్ ఆల్ అంటే- 4X6=24 అని అర్థమట! - Dangerous traveling - DANGEROUS TRAVELING
DANGEROUS TRAVELING : రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోపై 4ఇన్ ఆల్ అని ఉంటుంది. అంటే ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే కూర్చోవాలి. కానీ ఈ నిబంధనలను ఆటోవాలాలు ఎక్కడా పాటించడం లేదు. ఇష్టానుసారం ఎక్కించేస్తున్నారు. స్కూల్ పిల్లల విషయంలోనైతే ఇది శ్రుతిమించుతోంది. నెల్లూరు నగరంలో 25 మంది పాఠశాల విద్యార్ధులను ఒకేసారి ఆటోలో ఎక్కించారు.

By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2024, 1:50 PM IST
|Updated : Sep 20, 2024, 3:35 PM IST
నెల్లూరు జిల్లాలో గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఇలా పిల్లలు ఆటోలోనే సమీప పాఠశాలలకు వెళ్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఒకే సారి 24మంది ప్రతి రోజూ ఆటోలో ప్రయాణిస్తూ విద్యాభాస్యం చేస్తున్నారు. పాఠశాలకు రావడం, తిరిగి వెళ్లడంకు ఇలా ఇబ్బందులు పడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై ఆటో డ్రైవర్‌ను సంప్రదిస్తే ఆయన చెప్పిన సమాధానం మరీ విడ్డూరంగా ఉంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆటోలో పాఠశాలకు తీసుకెళ్తే డీజిల్ ఖర్చులు కూడా రావన్నారు. 24మంది ఆటోలో కూర్చోవడం కొంత ఇబ్బంది అయినా ప్రయాణంలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వడం లేదని ఆ ఆటో డ్రైవర్ చెప్పడం గమనార్హం.