ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

50 వేల కోట్లు లూటీ - ఇసుక దోపిడీపై టీడీపీ, జనసేన ఆందోళనలు: అచ్చెన్నాయుడు - Sand Mining in AP

Illegal Sand Mining in Andhra Pradesh: ఏపీలో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం టీడీపీ-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో సీఎం జగన్ ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు.

Illegal_Sand_Mining_in_Andhra_Pradesh
Illegal_Sand_Mining_in_Andhra_Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 3:23 PM IST

Illegal Sand Mining in Andhra Pradesh: సీఎం జగన్ రెడ్డి అక్రమ ఇసుక దోపిడిపై శనివారం తెలుగుదేశం-జనసేన ఆందోళనలు చేపట్టనున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసిన జగన్, ఇసుక మాఫియాతో ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని, అక్రమ తవ్వకాల ఫొటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు, తదితర ఆధారాలతో సహా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (Ministry of Environment and Forests), ఎన్జీటీ (National Green Tribunal) నిర్దారించాయని అచ్చెన్నాయుడు తెలిపారు. అయినా సరే జగన్ రెడ్డి ఇసుక దోపిడి మాత్రం ఆపటం లేదని మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల కనుసన్నల్లో 500కి పైగా రీచ్​ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. ఈ అక్రమ ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో రేపు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం - జనసేన ఆందోళనలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఇరు పార్టీ శ్రేణులు రీచ్​ల వద్ద నిరసనలు తెలపటంతో పాటు వైసీపీ అక్రమ ఇసుక దోపిడిని ఫోటోలు, సెల్పీల రూపంలో ప్రజల్లో ఎండగట్టాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

కలెక్టర్లతో మేనేజ్​ చేశారు - శాఖ శాటిలైట్ చిత్రాలతో దొరికిపోయారు!

TDP Pattabhi Ram on Sand Mining in AP: రాష్ట్రంలోని అక్రమ ఇసుక తవ్వకాలపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఎన్జీటీకి ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు విప్పాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్‌ చేశారు. మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డితో కలిసి పెద్దిరెడ్డి మీడియా ముందుకొచ్చి నివేదికపై సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకదోపిడీని కప్పిపుచ్చుతూ గతంలో 22-08-2023న వెంకటరెడ్డి ఏకంగా ఎన్జీటీకే తప్పుడు సమాచారమిచ్చాడని ఆరోపించారు.

ఎన్జీటీ చెప్పిన విధంగా లీజు కాలపరిమితి పూర్తయ్యేలోపు ఒక్కసారి కూడా ఒక్క ఇసుక రీచ్​ను ప్రభుత్వాధికారులు సందర్శించింది లేదని విమర్శించారు. ఒక్క రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇసుక తవ్వకాలపై సమీక్ష చేసింది లేదని, తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకున్నది లేదని మండిపడ్డారు. సీఎం జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి చేసిన దోపిడీకి జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు. వారి దోపిడీకి సహకరించిన చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు, కలెక్టర్లు, మైనింగ్ శాఖ అధికారులు తమ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని పట్టాభిరామ్‌ హితవుపలికారు.

కృష్ణా నదిలో అక్రమ తవ్వకాలు - అడ్డుకోవాలని కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details