HYDRA Demolishing Illegal Constructions In Madhapur: అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కావూరి హిల్స్ పార్కు స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారంటూ కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. అక్రమ నిర్మాణాలు తొలగించి కావూరిహిల్స్ పార్కు పేరిట బోర్డు ఏర్పాటు చేశారు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం - కావూరి హిల్స్‌లో షెడ్లు కూల్చివేత - Demolishing Illegal Constructions - DEMOLISHING ILLEGAL CONSTRUCTIONS
HYDRA Demolishing Illegal Constructions In Kavuri Hills: తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు తాజాగా మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో అక్రమ నిర్మాణాలను నేలకూల్చారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2024, 10:06 AM IST
అయితే పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని కోర్టులో స్టే సైతం తెచ్చుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు నకిలీ డాక్యుమెంట్లతో స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నారని కనీసం అసోసియేషన్ వారిని సైతం స్పోర్ట్స్ కి అనుమతించడం లేదని కావూరి హిల్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు.