Hydra Commissioner Ranganath on Demolitions in Hyderabad :అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈటీవీ నిర్వహించిన ఫోన్-ఇన్ కార్యక్రమలో (ETV Phone in with Ranganath) ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. చెరువులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అందుబాటులోకి తెస్తామని, గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్‌జోన్‌లు తెలుసుకునే అవకాశం ఇస్తామని ఆయన తెలిపారు.
ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చం : హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయని, ఆ నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత జరుగుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చుతామని స్పష్టం చేశారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఎఫ్‌టీఎల్‌లో నివాసం ఉంటున్న ప్రజల భవనాలు కూల్చమని తెలిపారు. ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చబోమన్న ఆయన అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు ఉంటాయని తెలిపారు.
అడ్డుకున్నా ఆగలేదు - వాటిపైకి దూసుకెళ్లిన హైడ్రా బుల్డోజర్లు
ఓఆర్‌ఆర్ లోపలే హైడ్రా పరిధి ఉంది : అనధికార నిర్మాణాలు ఎప్పటికైనా ప్రమాదమేనని రంగనాథ్ తెలిపారు. సూరత్‌లో 45 సంవత్సరాల తరువాత కూడా అక్రమ నిర్మాణాలు కూల్చారని గుర్తు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కూలగొట్టడం ఒక్కటే హైడ్రా పని కాదని 12 చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లు వివరించారు. పార్కుల కబ్జాలపై వేలాది ఫిర్యాదులు వస్తున్నాయన్నా రంగనాథ్ ఇప్పటికే ఎన్నో పార్కులు కాపాడామని తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపలే హైడ్రా పరిధి ఉందని అన్నారు. చెరువుల సంరక్షణ కోసం జీఎస్‌ఐ, ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహకారం కూడా తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
"గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్‌జోన్‌లు తెలుసుకునే అవకాశం ఇస్తాం. హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత జరుగుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చుతాం. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత. ఎఫ్టీఎల్‌లో ప్రజలు నివాసం ఉంటున్న భవనాలు కూల్చం. ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చబోం. అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు ఉంటాయి. " - రంగనాథ్, హైడ్రా కమిషనర్
భూకబ్జాదారులపై కఠిన చర్యలు తప్పవు - మరోసారి హెచ్చరించిన రంగనాథ్
హైడ్రా వాళ్ల జోలికి వెళ్లదు - కూల్చివేతలపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు