Hyderabad Police issued Some Restrictions On New Year Celebrations :డిసెంబర్ నెల కొనసాగుతోంది. ఇంకా కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రానుంది. ఇప్పటికే చాలామంది కొత్త సంవత్సర వేడుకలకు ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలని ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. అదేవిధంగా రిసార్ట్స్, హోటళ్లు, పబ్బులు, వ్యాపార సంస్థలు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలోకి ఎంతో ఉత్సాహంగా అడుగు పెట్టేందుకు వివిధ రకాల ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలావుంటే ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు తమ పనిలో ఉన్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా చేసుకునే వివిధ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు విధించారు. హోటళ్లు, రెస్టారంట్లు, పబ్బుల ఈవెంట్ల నిర్వాహకులంతా పాటించాల్సిన వివిధ నిబంధనలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వివరించారు. హైదరాబాద్ పరిధిలో రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహించే వారికి అనుమతి తప్పనిసరన్నారు. ఈవెంట్లు నిర్వహించే నిర్వాహకులు న్యూ ఇయర్‌కి 15 రోజులు ముందుగానే అనుమతి తీసుకోవాలని కోరారు. ఆ ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉండాలని స్పష్టం చేశారు.